T20 World Cup: సౌతాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో ఆసీస్ విక్టరీ

T20 World Cup: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది.

Update: 2021-10-23 15:26 GMT

T20 World Cup: సౌతాఫ్రికాపై 5 వికెట్ల తేడాతో ఆసీస్ విక్టరీ

T20 World Cup: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కంగారూలు 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించారు. సఫారీలు నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఛేదించారు. రెండు పరుగులు చేస్తే గెలుస్తారన్న దశలో ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టడంతో ఆస్ట్రేలియా విజయం ఖరారైంది.

మరోవైపు లక్ష్యఛేదనలో ఆసీస్ 20 పరుగులకే ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 11 పరుగులు చేసిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా వెనుదిరగ్గా మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరుబోర్డును నడిపించాడు. మ్యాక్స్ వెల్ 18 పరుగులు చేయగా, చివర్లో మాథ్యూ వేడ్ 15 పరుగులు, స్టొయినిస్ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. 

Tags:    

Similar News