IND vs WI: వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్? ఇదిగో బీసీసీఐ వీడియోనే సాక్ష్యం..!
Team India: ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో కనిపించని రోహిత్ శర్మ, డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి.. మరోషాక్ తగిలింది.
IND vs WI: వన్డే సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఔట్? ఇదిగో బీసీసీఐ వీడియోనే సాక్ష్యం..!
India vs West Indies ODI Series: వెస్టిండీస్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత క్రికెట్ జట్టు 1-0 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ కూడా బ్యాటింగ్‌తో చక్కటి సహకారం అందించాడు. అయితే, రేపటి నుంచి వన్డే సిరీస్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో కనిపించని రోహిత్ శర్మ, డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి.. మరోషాక్ తగిలింది. తాజాగా వన్డే సిరీస్ నుంచి కూడా బయటకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఓ వీడియోనే సాక్ష్యంగా పేర్కొంటున్నారు.
టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్..
వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో విజయం సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియా తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రెండో వన్డే వర్షం కారణంగా డ్రా అయింది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భాగమయ్యారు. ఇప్పుడు గురువారం నుంచి అంటే జులై 27 నుంచి రెండు దేశాల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
రోహిత్, విరాట్‌లకు విశ్రాంతి?
ఇంతలో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ట్విట్టర్ ఖాతా నుంచి ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చింది. దీనిలో చాలా మంది ఆటగాళ్ళు కొత్త ODI జెర్సీలను ధరించి కనిపించారు. సూర్యకుమార్ యాదవ్‌తో వీడియో ప్రారంభమవుతుంది. ఇందులో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ కూడా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే రోహిత్, విరాట్ ఈ వీడియోలో భాగం కాకపోవడం. ఇప్పుడు రోహిత్, విరాట్‌లు వన్డే సిరీస్‌లో భాగం కావడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆసియా కప్ కంటే ముందే విండీస్‌తో వన్డే పోరు..
ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్నందున ఈ సిరీస్ భారత జట్టుకు ముఖ్యమైనది. ఈసారి వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ వన్డే సిరీస్‌లోనైనా పెద్ద ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడాన్ని భారత జట్టుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలుస్తోంది.