Rishabh Pant: కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటా.? రిషబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rishabh Pant: టీమిండియా త్వరలోనే ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం సెలెక్షన్ పూర్తయ్యింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
Rishabh Pant: కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటా.? రిషబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rishabh Pant: టీమిండియా త్వరలోనే ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం సెలెక్షన్ పూర్తయ్యింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రిషభ్ పంత్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఈ నేపథ్యంలో పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాత్కాలిక విరామం తీసుకోనున్నట్లు పంత్ తెలిపారు. ‘‘ఐపీఎల్ ముగిసిన తర్వాత కొన్ని రోజులు క్రికెట్ నుంచి తాత్కాలికంగా దూరంగా ఉంటాను. ఆ తర్వాత ఇంగ్లండ్ టెస్టుల కోసం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతాను’’ అని ఆయన అన్నారు.
పంత్ ప్రస్తుత ఫామ్ టీమిండియాకు శుభ సంకేతంగా మారింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో పెద్దగా రాణించని అతను.. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 61 బంతుల్లోనే 118 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తనకు అవసరమైన ఫామ్‌ను తిరిగి పొందాడు. దీంతో అభిమానులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై పంత్ మాట్లాడుతూ.. ‘ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాలని అనుకుంటాను. కానీ అది ప్రతిసారీ సాధ్యం కాదు. ఆర్సీబీ మ్యాచ్‌లో మంచి ఆరంభం దక్కింది. దాన్ని పెద్ద ఇన్నింగ్స్‌గా మలిచాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ అనుభవజ్ఞులనుంచి నేర్చుకుంటూనే ఉన్నాను’’ అని చెప్పాడు.