Prasidh Krishna: కెరీర్లో తొలిసారి.. చరిత్ర సృష్టించిన ప్రసిద్ధ్ కృష్ణ
Prasidh Krishna: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఓవల్ టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.
Prasidh Krishna: కెరీర్లో తొలిసారి.. చరిత్ర సృష్టించిన ప్రసిద్ధ్ కృష్ణ
Prasidh Krishna: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఓవల్ టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, తన కెరీర్‌లో తొలిసారిగా ఒకే ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. గత రెండు మ్యాచ్‌లలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోని ప్రసిద్ధ్, ఈ మ్యాచ్‌తో తన సత్తా చాటాడు.
కెరీర్‌లో బెస్ట్ పర్ఫామెన్స్
ఓవల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 62 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇది అతని కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. దీనికంటే ముందు, సిడ్నీలో ఆడిన మ్యాచ్‌లో 42 పరుగులకు 3 వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో జాక్ క్రాలీ, జెమీ స్మిత్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్ వికెట్లను ప్రసిద్ధ్ కృష్ణ తన ఖాతాలో వేసుకున్నాడు.
సరికొత్త ఫామ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ
ఈ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ కచ్చితత్వం, లైన్-లెంగ్త్, స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టాడు. ఐదవ టెస్ట్‌లో భారత్ బలంగా నిలబడటంలో ప్రసిద్ధ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు భారత అభిమానులు ఈ మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ నుండి ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు.
ఆసక్తికరంగా మారిన ఓవల్ టెస్ట్
ఓవల్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా (కరుణ్ నాయర్ 57), ఇంగ్లాండ్ 247 పరుగులు చేసి 23 పరుగుల ఆధిక్యం సాధించింది. మహ్మద్ సిరాజ్ కూడా ఈ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి, 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు మూడో రోజు ఆటలో టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించాలని చూస్తోంది.