Vaibhav Suryavanshi : ఒక్క రోజు కూడా నిలవని వైభవ్ రికార్డ్.. 177 కొట్టి బద్దలు కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్!

Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

Update: 2025-12-13 04:30 GMT

Vaibhav Suryavanshi : ఒక్క రోజు కూడా నిలవని వైభవ్ రికార్డ్.. 177 కొట్టి బద్దలు కొట్టిన పాకిస్తాన్ బ్యాటర్!

Vaibhav Suryavanshi: అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. వైభవ్ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో వైభవ్ ఆ సమయంలో అండర్-19 ఏషియా కప్ చరిత్రలోనే అతిపెద్ద వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డ్ సృష్టించాడు. వైభవ్ సెంచరీ కారణంగా భారత జట్టు యూఏఈపై ఏకంగా 433 పరుగుల భారీ స్కోరు సాధించి, ఆ మ్యాచ్‌ను 234 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ ప్రదర్శనకు వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అయితే, వైభవ్ సృష్టించిన ఈ రికార్డు ఒక రోజు కూడా నిలవలేదు. తొలి రోజు జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ యువ బ్యాటర్ సమీర్ మన్హాస్ మలేషియాపై ఏకంగా 177 పరుగులు సాధించి వైభవ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. దీంతో అండర్-19 ఆసియా కప్‌లో అతిపెద్ద వ్యక్తిగత స్కోరు రికార్డు ప్రస్తుతం మన్హాస్ పేరు మీదకు మారింది. మన్హాస్ తన ఇన్నింగ్స్‌ను 148 బంతుల్లో ఆడి, అందులో 8 సిక్సర్లు, 11 ఫోర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 345 పరుగులు చేయగా, మలేషియా జట్టు కేవలం 48 పరుగులకే ఆలౌట్ అయి, పాకిస్తాన్ కూడా విజయం సాధించింది. మన్హాస్‌కు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఈ ఇద్దరు బ్యాటర్లు వైభవ్ సూర్యవంశి (భారత్), సమీర్ మన్హాస్ (పాకిస్తాన్) డిసెంబర్ 14 (ఆదివారం) నాడు జరగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, అలాగే సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.

Tags:    

Similar News