Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు.. డీఎస్పీ సిరాజ్ కథ ఎంతోమందికి స్ఫూర్తి
Mohammed Siraj Net Worth: ఆటో డ్రైవర్ కొడుకు నుండి అంతర్జాతీయ క్రికెటర్‌గా మారడం వరకు మొహమ్మద్ సిరాజ్ ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తుంది. నేడు అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అంతేకాదు వందల కోట్లు సంపాదించాడు.
టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ విజయవంతమైన క్రికెటర్‌గా ఎదగడానికి చేసిన ప్రయాణం ఒక సినిమా కథ లాంటిది. అతను టెస్ట్ అరంగేట్రం తర్వాత భారత క్రికెట్ ప్రపంచంలో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌లో సాధారణ కుటుంబం నుండి అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు అతని ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. మహ్మద్ సిరాజ్ నికర విలువను పరిశీలిస్తే, అతని ఆదాయం, ఆట జీతం, ఎండార్స్‌మెంట్‌లు, విలాసవంతమైన ఇళ్ళు, గొప్ప కార్ల సేకరణ వరకు ప్రతి ఒక్కటి ఆకర్షిస్తుంటాయి.
మొహమ్మద్ సిరాజ్ బాల్యం అత్యంత పేదరికంలో గడిచింది. అతని తండ్రి హైదరాబాద్‌లో ఆటో నడిపేవాడు. చిన్నతనంలో ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించి, సిరాజ్ తన కృషి, అంకితభావంతో ఈ స్థాయికి చేరుకున్నాడు. IPL కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) శిబిరంలో చేరి 2021 ప్రారంభంలో ఆస్ట్రేలియా గడ్డపై తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సిరీస్ గెలిచిన తర్వాత సిరాజ్ ప్రపంచ ద్రుష్టిని ఆకట్టుకున్నాడు. ఎన్నో సార్లు అద్భుతమైన ప్రదర్శనతో సక్సెస్ ఫుల్ ప్లేయర్ అనిపించుకున్నాడు.
ఇండియా.కామ్ ప్రకారం, మహమ్మద్ సిరాజ్ మొత్తం సంపద రూ. 57 కోట్లు. మీడియా నివేదికల ప్రకారం, భారత ఫాస్ట్ బౌలర్‌కు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని జూబ్లీ హిల్స్‌లో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ ఆస్తి విలువ రూ. 13 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన తర్వాత అతను అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లను అందుకున్నాడు. BCCI, IPL కాంట్రాక్ట్ లతో సంపద భారీగా పెరిగింది. సిరాజ్ యాడ్స్ ద్వారా బాగానే సంపాదిస్తున్నాడు.
2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ సిరాజ్‌ను రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతని BCCI కాంట్రాక్ట్ గ్రేడ్ A కేటగిరీకి చెందినది. దీని కింద అతను సంవత్సరానికి రూ. 5 కోట్ల జీతం పొందుతున్నాడు. సిరాజ్ కు MyCircle11, Be O Man, CoinSwitchKuber, Crash on the Run, MyFitness, SG ThumsUp వంటి అనేక అగ్ర బ్రాండ్ల నుండి ఎండార్స్‌మెంట్‌లు కూడా ఉన్నాయి. అతని కార్ల సేకరణలో, రేంజ్ రోవర్ వోగ్, BMW 5 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ S క్లాస్, టయోటా ఫార్చ్యూనర్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆనంద్ మహీంద్రా ఇటీవల అతనికి థార్‌ను బహుమతిగా ఇచ్చారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చిలో 2023 సంవత్సరానికి వారి వార్షిక ప్లేయర్ రిటైనర్‌షిప్‌ను ప్రకటించింది. దీనిలో వారు మహమ్మద్ సిరాజ్‌ను గ్రేడ్ B క్రికెటర్‌గా జాబితా చేశారు. దీని తరువాత, సిరాజ్ మరుసటి సంవత్సరం A గ్రేడ్‌కి వచ్చాడు. అతని జీతం రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్లకు పెరిగింది. దీనితో పాటు, అతను టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్‌లు ఆడితే రూ. 6 లక్షలు, ప్రతి టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నాడు.