Mohammad Shami : జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ఫేసర్.. తన టార్గెట్ అదేనట
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టులో స్థానం దక్కించుకోలేక పోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్.
Mohammad Shami : జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ఫేసర్.. తన టార్గెట్ అదేనట
Mohammad Shami : టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గత కొంతకాలంగా భారత జట్టులో స్థానం దక్కించుకోలేక పోతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు, తాజాగా ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో షమీ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి, జాతీయ జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.
జాతీయ జట్టులో స్థానం దొరక్కపోయినా నిరాశ చెందని మహ్మద్ షమీ, దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రంజీ ట్రోఫీ 2025-26 జట్టులో అతనికి స్థానం కల్పించారు. షమీ జట్టులోకి రావడం బెంగాల్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి, ముఖ్యంగా ఆకాష్ దీప్‌తో కలిసి, గొప్ప బలాన్ని ఇస్తుంది. రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణించి మళ్లీ టీమిండియా దృష్టిని ఆకర్షించాలని షమీ పట్టుదలగా ఉన్నాడు.
రంజీ ట్రోఫీ కోసం నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్‌ను బెంగాల్ జట్టు కెప్టెన్‌గా నియమించారు. యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కోచింగ్ సిబ్బందిలో ఎలాంటి మార్పులు లేవు. లక్ష్మీ రతన్ శుక్లా హెడ్ కోచ్‌గా కొనసాగనుండగా, అరుణ్ భట్టాచార్య, శివ్ శంకర్ పాల్ అసిస్టెంట్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. చరణ్‌జీత్ సింగ్ మాతరూ ఫీల్డింగ్ కోచ్‌గా ఉంటారు.
ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో బెంగాల్ జట్టును ఎలైట్ గ్రూప్ సీలో ఉంచారు. ఈ గ్రూప్‌లో గుజరాత్, హర్యానా, ఆర్మీ, రైల్వేస్, త్రిపుర, ఉత్తరాఖండ్, అస్సాం వంటి బలమైన జట్లు ఉన్నాయి. బెంగాల్ తమ టోర్నమెంట్‌ను అక్టోబర్ 15న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఉత్తరాఖండ్‌తో తలపడటం ద్వారా ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 25 నుంచి గుజరాత్‌తో మరో హోమ్ మ్యాచ్ ఆడనుంది.
రంజీ ట్రోఫీ కోసం బెంగాల్ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అభిషేక్ పోరెల్, సుదీప్ కుమార్ ఘరామి, అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఛటర్జీ, సుమంత్ గుప్తా, సౌరభ్ కుమార్ సింగ్, విశాల్ భాటి, మహ్మద్ షమీ, ఆకాష్ దీప్, సూరజ్ సింధు జైస్వాల్, షాకిర్ హబీబ్ గాంధీ, ఇషాన్ పోరెల్, ఖాజీ జునైద్ సైఫీ, రాహుల్ ప్రసాద్, సుమిత్ మొహంతా, వికాస్ సింగ్.