Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ ఆశా భోంస్లే మనవరాలితో డేటింగ్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న ఫోటో

Update: 2025-01-26 06:38 GMT

Mohammed Siraj: భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లోకి ఎక్కారు. ఈ ఫాస్ట్ బౌలర్‌ కు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి టీం ఇండియాలో చోటు దక్కలేదు. ప్రస్తుతం డిఎస్పీ సిరాజ్ తన డేటింగ్ విషయమై వార్తల్లో నిలిచారు. అతడికి సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. మహమ్మద్ సిరాజ్ ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమో కాదో తెలుసుకుందాం.

ఇటీవలే జనాయ్ భోంస్లే తన 23వ పుట్టినరోజును జరుపుకున్నారు. తన పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్, క్రికెట్ ప్రపంచం నుండి చాలా మంది తారలు హాజరయ్యారు. వారిలో డిఎస్పీ సిరాజ్ కూడా ఉన్నారు. ఆ పార్టీలో సిరాజ్ ఉండటం మాత్రమే కాకుండా జనాయ్ తో అతని ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.

జనాయ్ భోంస్లే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బర్త్ డే పార్టీకి సంబంధించిన అనేక ఫోటోలను షేర్ చేశారు. అందులో ఆమె ఆశా భోంస్లేతో కలిసి కేక్ కట్ చేస్తూ కనిపించింది. ఇది కాకుండా, ఆమె చాలా మంది తారలతో ఉన్నఫోటోలలో కనిపించింది. కానీ సిరాజ్‌తో ఉన్న ఫోటో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫోటోలో సిరాజ్, జనాయ్ నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు చూడవచ్చు. వారిద్దరి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయి చర్చనీయాంశంగా మారింది.

జనాయ్ భోంస్లే పోస్ట్ కామెంట్లలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక యూజర్ "నువ్వు సిరాజ్ భాయిజాన్ ని పెళ్లి చేసుకోబోతున్నావా?" అని అడిగారు. మరొక నెటిజన్ సిరాజ్‌ను అభినందించారు . ఇది కాకుండా, అభిమానులు ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవుతున్నారని కామెంట్స్ చేశారు.నిజంగానే సిరాజ్, జనాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. సిరాజ్, జనాయ్ మధ్య సంబంధం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. ఈ వార్తలను అంతటా వైరల్ చేసిన ఫోటోల ఆధారంగా మాత్రమే డేటింగ్ వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Tags:    

Similar News