Lakshya Sen: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
Lakshya Sen: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తన ఖాతాలో మరో స్వర్ణం వేసుకుంది.
Lakshya Sen: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
Lakshya Sen: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తన ఖాతాలో మరో స్వర్ణం వేసుకుంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. మలేసియా ఆటగాడు జె యంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ 19-21, 21-9, 21-16తో విజయం సాధించాడు. దీంతో 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 57 పతకాలు సాధించింది. అందులో 20 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్య పతకాలు ఉన్నాయి. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.