Kuldeep Yadav : కుల్దీప్ యాదవ్ సంచలనం.. పాకిస్తాన్ బౌలర్ రికార్డు బద్దలు!
యూఏఈని 9 వికెట్ల తేడాతో ఓడించి 2025 ఆసియా కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్, 2.1 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడం ఈ మ్యాచ్‌లో హైలైట్.
Kuldeep Yadav : కుల్దీప్ యాదవ్ సంచలనం.. పాకిస్తాన్ బౌలర్ రికార్డు బద్దలు!
Kuldeep Yadav : యూఏఈని 9 వికెట్ల తేడాతో ఓడించి 2025 ఆసియా కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్, 2.1 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడం ఈ మ్యాచ్‌లో హైలైట్. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కుల్‌దీప్, దీంతో ఒక గొప్ప రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
పాకిస్థాన్ స్పిన్నర్ రికార్డు బ్రేక్
కుల్‌దీప్ యాదవ్ 13 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఆసియా కప్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలలో ఇది రెండో స్థానంలో ఉంది. ఈ రికార్డుతో కుల్‌దీప్ యాదవ్, పాకిస్థాన్‌కు చెందిన షాదాబ్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు. 2022 ఆసియా కప్‌లో హాంకాంగ్‌కు వ్యతిరేకంగా షాదాబ్ 17 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు.
రవిచంద్రన్ అశ్విన్‌ను దాటేశాడు
అంతేకాకుండా, స్వదేశం వెలుపల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో కుల్‌దీప్ యాదవ్ ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌ను అధిగమించాడు. కుల్‌దీప్ ఇప్పటి వరకు స్వదేశం వెలుపల 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, సగటున 11.15 పరుగులు ఇచ్చి మొత్తం 52 వికెట్లు తీశాడు. గతంలో రెండో స్థానంలో ఉన్న అశ్విన్ 50 వికెట్లు తీశాడు. స్వదేశం వెలుపల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మొత్తం 71 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.