Saina Nehwal: క‌రోనా వేళ ఈ టోర్నీ అవ‌స‌ర‌మా?: సైనా నెహ్వాల్‌

Saina Nehwal: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు శ‌రవేగంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో షట్లర్ల ఆరోగ్య భద్రతపై ఎటువంటి హామీ లేదు.

Update: 2020-09-14 03:10 GMT

Saina Nehwal

 Saina Nehwal: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు శ‌రవేగంగా పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో షట్లర్ల ఆరోగ్య భద్రతపై ఎటువంటి హామీ లేదు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో డెన్మార్క్‌ వేదికగా నిర్వహించనున్న థామస్‌, ఉబర్‌కప్‌లపై ప‌లు అనుమానులు వెలువెత్తున్నాయి. తాజాగా భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. సైనా ట్విట్టర్ వేదిక‌గా థామస్‌, ఉబర్‌ కప్‌లపై ప్రశ్నించింది. ' థామస్‌, ఉబర్‌ కప్‌ల నుంచి ఏడు దేశాలు వైదొలిగాయి. కరోనా మహమ్మారి కఠిన పరిస్థితుల్లో థామస్‌, ఉబర్‌ కప్‌ల టోర్నీలను నిర్వహించటం సురక్షితమేనా?' అని సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేసింది.

కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో.. టోర్నీకి తమ ఆట‌గాళ్ల‌ను పంపలేమని ఆరు దేశాలు టోర్నీ నుంచి వైదొలిగాయి. ఈ జాబితాలో 13 సార్లు థామస్‌ కప్‌ విజేత, మూడుసార్లు ఉబర్‌ కప్‌ విజేత ఇండోనేషియా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఈ బాట‌లోనే దక్షిణ కొరియా, థారులాండ్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, తైవాస్‌, సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌లు థామస్‌, ఉబర్‌ కప్‌లో పాల్గొనటం లేదు. భార‌త స్టార్ షట్ల‌ర్ పి.వి. సింధు తొలుత కుటుంబ కారణాల రీత్యా థామస్‌, ఉబర్‌ కప్‌లో ఆడలేనని తెలిపింది. కానీ బారు అధ్యక్షుడు జోక్యంతో సింధు ఆడేందుకు అంగీకారం తెలిపింది.  

Tags:    

Similar News