PV Sindhu: ఉబెర్ కప్ బ‌రిలో పీవీ సింధు

PV Sindhu:  ఉబెర్ కప్ బ‌రిలో పీవీ సింధు
x
Highlights

PV Sindhu: వచ్చే నెలలో జరిగే థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్ లో వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఆడనున్న‌ది. తొలుత వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు సింధు ప్రకటించిన విషయం తెలిసిందే

PV Sindhu: వచ్చే నెలలో జరిగే థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్ లో వరల్డ్‌ చాంపియన్‌ పీవీ సింధు ఆడనున్న‌ది. తొలుత వ్యక్తిగత కారణాలతో ఈ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు సింధు ప్రకటించిన విషయం తెలిసిందే. తన కుటుంబసభ్యులకు చెందిన వేడుక కోసం ఈ టోర్నీలో ఆడనని చెప్పింది. అయితే భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చీఫ్‌ హిమంత బిశ్వ శర్మ మాత్రం ఆమెతో మాట్లాడి ఒప్పించినట్లు తెలిసింది.

ఈ విషయాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నాడు. 'ఉబెర్‌ కప్ లో భారత్‌ తరుపున ఆడాల్సిందిగా సింధును కోరాను. ఆమె జట్టుతో కలిసి ఆడితే భారత్‌కు పతకం అవకాశాలుంటాయని చెప్పాను. దీంతో ఆమె బరిలోకి దిగేందుకు సమ్మతించింది' అని బిశ్వ శర్మ పేర్కొన్నారు. సింధు తన కుటుంబానికి చెందిన వేడుకను టోర్నీ ప్రారంభానికంటే ముందుగా నిర్వహించుకుంటానని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు.

డెన్మార్క్‌లో వచ్చేనెల 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 'బాయ్‌' ఈ టీమ్‌ ఈవెంట్‌ కోసం 26 మంది షట్లర్లకు హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో శిబిరం నిర్వహిస్తోంది. 17న తుది జట్లను ఎంపిక చేస్తారు. చాంపియన్‌ పీవీ సింధు.. వచ్చే నెలలో జరగనున్న థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌లో ఆడుతుందని జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) అధ్యక్షుడు హిమంత బిస్వ శర్మ చెప్పారు

అయితే ఈ ట్రోర్నీకి .. ఇక భారత పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయి‌రాజ్, చిరాగ్ శెట్టి.. ఈ ఉబెర్ కప్‌కు దూరమయ్యారు. తెలుగు ప్లేయర్ సాత్విక్ ఇటీవల కరోనా బారిన పడడమే ఇందుకు కారణం. ఈ మేరకు బాయ్‌కు సమాచారమిచ్చారు. మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోనున్నాడు. ఇందులో నెగెటివ్ వచ్చినా.. మరో పది రోజులు దాకా ప్రాక్టీస్‌కు రాలేడు. భాగస్వామి అందుబాటులో లేకపోవడంతో చిరాగ్ కూడా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. వీరి నిర్ణయానికి బాయ్ కూడా ఓకే చెప్పింది.

Show Full Article
Print Article
Next Story
More Stories