PV Sindhu| ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీకి పీవీ సింధు దూరం

PV Sindhu| ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీకి  పీవీ సింధు దూరం
x
Highlights

PV Sindhu| డెన్మార్క్‌లో జ‌రుగ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​కు భార‌త‌ స్టార్​ షట్లర్​ పీవీ సింధు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు.

PV Sindhu| డెన్మార్క్‌లో జ‌రుగ‌నున్న ప్ర‌తిష్టాత్మ‌క థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​కు భార‌త‌ స్టార్​ షట్లర్​ పీవీ సింధు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరగనుంది.

పీవీ సింధు వ్యక్తిగత కారణాల వల్ల 2020 థామస్ అండ్‌ ఉబెర్ కప్‌లో పాల్గొనడం లేదు' అని పీవీ రమణ తెలిపారు. థామస్ అండ్ ఉబెర్ కప్ టోర్నీ నుంచి వైదొలుగుతున్న‌ట్టు అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కూడా తెలిపిన‌ట్టు స‌మాచారం.

రాబోయే మరో రెండు టోర్నమెంట్‌లకు కూడా పీవీ సింధు తన ఎంట్రీలను పంపనున్నదని, అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఆ టోర్నీల్లో ఆడాలా, వద్దా అనే విషయాన్నిఅప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణయించుకోనున్నదని సింధు తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. అయితే డెన్మార్క్‌లోని ఓడెన్స్‌లో జరుగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ 750 టూర్ ఇవెంట్లలో సింధు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. గతేడాది ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడిన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories