IPL 2021: బార్‌లో తాగి రచ్చ రచ్చ చేసిన వార్నర్, స్లేటర్

IPL 2021: .డేవిడ్ వార్నర్, మైఖెల్ స్లేటర్ ఇద్దరూ బాహాబాహీకి దిగినట్లు ది డైల్ టెలిగ్రాఫ్ అనే పత్రిక ఒక కథనం వెలువరిచింది

Update: 2021-05-09 09:25 GMT

 వార్నర్ ఫైల్ ఫోటో 

IPL 2021: క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ 2021 అర్థాంత‌రంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇత‌ర దేశ‌ల ఆట‌గాళ్లు వారి స్వదేశాలు వెళ్ళిపోయారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కలిక నిషేధం విధించడంతో ఆదేశ‌ ఆటగాళ్ల ప్రయాణాలు వాయిదా పడ్డాయి. బీసీసీఐ ప్రత్యేక విమానాల్లో మాల్దీవులకు తరలించారు. ప్రస్తుతం మాల్దీవుల్లోని తాజ్ కోరల్ రిసార్టులో బస చేస్తున్నారు.

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సార‌థి డేవిడ్ వార్నర్, స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ మైఖెల్ స్లేటర్ ఇద్దరూ అదే రిసార్టులో బస చేస్తున్నారు. అయితే గత రాత్రి అక్కడి బార్‌లో ఇద్ద‌రి మ‌ధ్య‌ వాగ్వివాదం చెలరేగిందని..డేవిడ్ వార్నర్, మైఖెల్ స్లేటర్ ఇద్దరూ బాహాబాహీకి దిగినట్లు ది డైల్ టెలిగ్రాఫ్ అనే పత్రిక ఒక కథనం వెలువరిచింది. అయితే ఏ విషయంలో తేడా వచ్చిందో తెలియదు కానీ ఇద్దరూ కొట్టుకునే వారకు వెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

కాగా.. వార్నర్, స్లేటర్ మంచి స్నేహితులుగా అనే సంగ‌తి తెలిసిందే. క్రికెట్ లేని సమయంలో సరదాగా గ‌డుపుతారు. ది డైల్ టెలిగ్రాఫ్ అనే పత్రిక కథనాన్ని ఇద్దరు క్రికెటర్లు ఖండించారు. ఏ ఆధారాలు లేకుండా తప్పుడు కథనాన్ని ఎలా ప్రచురిస్తారంటూ సదరు పత్రికపై విరుచుకపడ్డారు. మైఖేల్ స్లేటర్ ఇదే విష‌యంపై జర్నలిస్ట్ రోత్‌ఫీల్డ్‌కు ఒక సందేశం పంపాడు. 'వార్నర్ నేను మంచి స్నేహితులం. అసలు గొడ‌వ జరిగే అవకాశమే లేదు. ఇలా పుకార్లను ఎందుకు పుట్టిస్తారో' అని స్లేటర్ పేర్కొన్నాడు. ఆ తర్వాత వార్నర్ కూడా ఆ జర్నలిస్టుకు అలాంటి సందేశమే పంపాడు.

Tags:    

Similar News