Champions Trophy 2025: ఎట్టకేలకు టీం ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న 8 జట్లూ తమ కొత్త జెర్సీలతో కనిపించాయి.
Champions Trophy 2025: ఎట్టకేలకు టీం ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతున్న 8 జట్లూ తమ కొత్త జెర్సీలతో కనిపించాయి. ఈ ఐసిసి టోర్నమెంట్ కోసం టీం ఇండియా జెర్సీ రంగు, డిజైన్ కూడా మారిపోయి కొత్త జెర్సీ వచ్చింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతర జట్ల మాదిరిగానే పాకిస్తాన్ పేరు కూడా భారత జట్టు జెర్సీపై ముద్రించారు. ప్రతి ఐసిసి ఈవెంట్‌లో టోర్నమెంట్ లోగోతో పాటు, ఆతిథ్య దేశం పేరు కూడా జట్ల జెర్సీలపై ముద్రించడం ఆనవాయితీ. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ కారణంగానే టోర్నమెంట్ కోసం రెడీ చేసిన ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉంటుంది.
అంతకుముందు భారత జట్టు జెర్సీ భిన్నంగా ఉంటుందన్న ఊహాగానాలు వచ్చాయి. దానిపై పాకిస్తాన్ పేరు పేర్కొనడం లేదని వార్తలు వచ్చాయి.ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో భారత ఆటగాళ్ల ఫోటోలు బయటకు వచ్చాయి. వీటిలో ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరు జెర్సీపై ఉంటుందని స్పష్టమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తయారు చేసిన జెర్సీలో మరో ప్రత్యేకత ఏమిటంటే దాని షోల్డర్ పై త్రివర్ణ పతాకం ఉంటుంది. ముందు భాగంలో INDIA అని పెద్ద అక్షరాలతో ముద్రించారు. కలర్ విషయానికి వస్తే.. అది నీలం రంగులో ఉంటుంది. ఇది సంవత్సరాలుగా టీం ఇండియా గుర్తింపు.
టీం ఇండియాకు చెందిన 15 మంది ఆటగాళ్లు కొత్త జెర్సీలో ఫోటోషూట్ చేయించుకున్నారు. వీరందరూ టోర్నమెంట్‌కు ఎంపికైన ఆటగాళ్లే. కొత్త ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలో టీం ఇండియా ఆటగాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ ఐసిసి టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా తన ప్రయాణం రెండవ రోజు అంటే ఫిబ్రవరి 20 నుండి ప్రారంభిస్తుంది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే బంగ్లాదేశ్‌ను అది ఎదుర్కొంటుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 2న గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుంది.