India vs South Africa 3rd T20: ఓడిన భారత్.. సిరీస్ సమానం చేసిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచుల సిరీస్ ను భారత జట్టు 1-1 తొ సమానం చేసుకుంది. నిర్నయాత్మక మూడో మ్యాచ్ లో సౌతాఫ్రికా అలవోకగా భారత జట్టుపై గెలిచి సిరీస్ ను డ్రా చేసుకోగలిగింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడుమ్యాచుల టీ20 సిరీస్ లో ఆఖరు మ్యాచ్ లో భారత జట్టును దక్షిణాఫ్రికా ఓడించింది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించి సిరీస్ ను సమానం చేసుకుంది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా రెండో మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ ఆదివారం జరిగింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాట్స్ మెన్ అందరూ పూర్తిగా నిరాశపరిచారు. ఒక్క ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా మిగిలిన ఆటగాళ్ళందరూ తాక్కువ పరుగులకే బ్యాట్లు ఎత్తేశారు. ధావన్ 25 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది టీమిండియా. బదులుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో డికాక్ 52 బంతుల్లో 79 పరుగులు చేయడంతో మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టిన బురాన్ హెండ్రిక్స్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.