IND vs SA T20 : టీమిండియాకు ఓపెనర్లు ఎవరు? గిల్, అభిషేక్, సంజు... ఎవరికి ఛాన్స్?

భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి (డిసెంబర్ 9) నుంచి కటక్‌లో ప్రారంభం కానుంది. ఈ మొదటి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారు అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.

Update: 2025-12-09 05:30 GMT

IND vs SA T20 : టీమిండియాకు ఓపెనర్లు ఎవరు? గిల్, అభిషేక్, సంజు... ఎవరికి ఛాన్స్?

IND vs SA T20 : భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి (డిసెంబర్ 9) నుంచి కటక్‌లో ప్రారంభం కానుంది. ఈ మొదటి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఓపెనర్లుగా ఎవరు బరిలోకి దిగుతారు అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే భారత జట్టులో శుభ్‌మన్‌ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ముగ్గురు పటిష్టమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు అందుబాటులో ఉన్నారు.

గత రికార్డులు ఏం చెబుతున్నాయి?

గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్‌లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఆడినప్పుడు, సంజూ శాంసన్ ఒక అద్భుతమైన సెంచరీ చేసి మెరిశాడు. అయితే ఆసియా కప్‌లో భారత జట్టు తమ ఓపెనర్లను మార్చింది. ఆ సమయంలో శుభ్‌మన్‌ గిల్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వారిద్దరి జోడీ బాగా కుదరడంతో, దక్షిణాఫ్రికాపై కూడా ఈ ఇద్దరినే ఓపెనర్లుగా కొనసాగించే అవకాశం ఉంది.

గిల్-అభిషేక్ జోడీ ఖాయమా?

అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. మరోవై శుభ్‌మన్‌ గిల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. కాబట్టి, అతన్ని ప్లేయింగ్ XI నుంచి తప్పించడం కష్టం. ఈ కారణాల వల్ల శుభ్‌మన్‌ గిల్, అభిషేక్ శర్మ లను ఓపెనర్లుగా కొనసాగించడం ఖాయమని చెప్పవచ్చు.

సంజు శాంసన్‌కు కొత్త పాత్ర

దక్షిణాఫ్రికాపై గత నాలుగు ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు సహా 216 పరుగులు చేసిన సంజు శాంసన్ ఫామ్‌ను టీమిండియా వదులుకోదు. అందుకే ఈసారి సంజు శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో లేదా వికెట్ కీపర్ బ్యాటర్‌గా బరిలోకి దించే అవకాశం ఉంది. ఇది జట్టుకు మరింత బలాన్ని చేకూర్చగలదు.

టీమిండియా తుది జట్టు (అంచనా)

అభిషేక్ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

Tags:    

Similar News