Mohammed Siraj: నిప్పులు చెరిగిన సిరాజ్.. దక్షిణాఫ్రికాపై దుమ్మురేపిన హైదరాబాదీ పేసర్‌

Mohammed Siraj: టెస్టుల్లో భారత్‌పై ఇదే అత్యల్పం

Update: 2024-01-04 02:51 GMT

Mohammed Siraj: నిప్పులు చెరిగిన సిరాజ్.. దక్షిణాఫ్రికాపై దుమ్మురేపిన హైదరాబాదీ పేసర్‌

Mohammed Siraj: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా సత్తా చాటింది. తొలి టెస్ట్‌లో భారీ ఓటమి నుంచి పుంజుకుంది. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ నాయకత్వం వహిస్తే బుమ్రా, ముఖేశ్‌కుమార్ మిగతా పని పూర్తి చేశారు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌పై పేసర్లు ముఖ‌్యంగా సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఇన్‌‌స్వింగ్, ఔట్ స్వింగ్, ఫుల్, గుడ్ లెంగ్త్‌ బంతులతో సఫారీలపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్ మార్క్మ్‌తో మొదలై చివరి వరకు కొనసాగింది. లంచ్ విరామ సమయానికే 5 వికెట్లు సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 92ఏళ్ల దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.

కెప్టెన్ ఎల్గర్ , టోనీ డీ జార్జి, బెడింగ్‌హామ్, జాన్సెన్, కైల్ వెరైన్‌ను సిరాజ్ పెలివియన్ పంపించాడు. టెస్ట్‌ సిరీస్‌లో తొలిసారి ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. సిరాజ్‌, బుమ్రా, ముఖేశ్‌ ధాటికి దక్షిణాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది.

భారత్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ జైస్వాల్ డకౌట్ అయ్యాడు. రోహిత్ వర్మ 39 పరుగులు, గిల్ 36, విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించారు. ఆ తర్వాత రాహుల్, జడేజా, బుమ్రా, కోహ్లీ, సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. 153 పరుగులకు 4 వికెట్లతో మెరుగ్గా ఉన్న టీమిండియా 11 బంతుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. పరుగులేమి లేకుండానే ఇన్ని వికెట్లు కోల్పోవడం టెస్టుల్లో ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 55 పరుగులకు ఆలౌట్‌ కాగా... భారత్ తొలి ఇన్నింగ్స్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 3 వికెట్లకు 62 పరుగులు చేసింది.

Tags:    

Similar News