IND vs SA 2nd ODI: రెండో వన్డేలో చెలరేగి ఆడుతున్న బ్యాటర్లు.. రుతురాజ్‌ ఫస్ట్‌ సెంచరీ.. విరాట్‌ ‘సెకండ్‌’ సెంచరీ

IND vs SA: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు.

Update: 2025-12-03 11:41 GMT

IND vs SA 2nd ODI: రెండో వన్డేలో చెలరేగి ఆడుతున్న బ్యాటర్లు.. రుతురాజ్‌ ఫస్ట్‌ సెంచరీ.. విరాట్‌ ‘సెకండ్‌’ సెంచరీ

IND vs SA: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయపూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు 102 పరుగులు చేశారు. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో భారత్ భారీ స్కోర్ దిశగా వడివడిగా పరుగులు తీస్తోంది.

రుతురాజ్‌కి ఇది తొలి సెంచరీకాగా.. విరాట్‌ కోహ్లీకి ఇది ఈ సిరీస్‌లో రెండో సెంచరీ. 52 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన గైక్వాడ్.. మరో 25 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకోవడం విశేషం. కేశవ్ మహరాజ్‌ వేసిన 28 ఓవర్‌లో రుతురాజ్‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదేశాడు. తర్వాత బాష్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు. కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్‌కు వన్డేల్లో ఇది తొలి శతక కావడం విశేషం. అయితే శతకం సాధించిన వెంటనే రుతురాజ్‌ అవుటైపోయాడు. విరాట్‌ కోహ్లీ 47 బంతుల్లో హాఫ్ సెంచరీ, 90 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే ఔటయ్యాడు. ఇక ఈ సిరీస్‌లో తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వన్డేల్లో విరాట్‌ వరుసగా రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేయడం ఇది 11వ సారి. 

Tags:    

Similar News