India vs Pakistan - ICC: "ది వరల్డ్ ఇస్ వాచింగ్".. భారత్ - పాక్ మ్యాచ్ ప్రోమో

* భారత్ - పాకిస్తాన్ మధ్య నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది ఐసిసి.

Update: 2021-10-24 10:36 GMT

India vs Pakistan - ICC: "ది వరల్డ్ ఇస్ వాచింగ్".. భారత్ - పాక్ మ్యాచ్ ప్రోమో

India vs Pakistan - ICC: భారత్ - పాకిస్తాన్ మధ్య నేడు జరగనున్న టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది ఐసిసి. భరత్ - పాక్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా 58 సెకన్ల నిడివి గల ప్రోమో వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సగటు అభిమాని అనుకున్నట్టుగానే "టుడే ఇస్ ది బిగ్ డే" అంటూ ప్రారంభమైన ఈ ప్రోమోలో ఇండియా, పాకిస్తాన్, ఫ్యాషన్, రైవల్రీ, ప్రెషర్ అనే పాదాలను ఉపయోగిస్తూ చివరగా "ది వరల్డ్ ఇస్ వాచింగ్" అంటూ ప్రోమోని ముగించింది.

ఇక ఈ ప్రోమోలో గతంలో జరిగిన మ్యాచ్ ల క్లిప్పింగ్స్ తో పాటు బౌలింగ్, బ్యాటింగ్, వికెట్స్, అభిమానుల కోలాహలంతో రూపొందించిన ఈ ప్రోమో ఐసిసి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఏ మ్యాచ్ కి లేని క్రేజ్ భారత్ - పాక్ మ్యాచ్ కు ఉండటంతో ఈ ప్రోమోని మొదటిసారిగా ప్రత్యేకంగా రూపొందించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

Tags:    

Similar News