Pakistan : మ్యాచ్‌ను అడ్డుకుంటారా.. వీడియోలు రికార్డు చేస్తారా.. పాకిస్తాన్‌పై ఐసీసీ ఆగ్రహం

ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వరుస వివాదాలతో ఇబ్బందులు పడుతోంది. హ్యాండ్‌షేక్ వివాదం ఇంకా సద్దుమణగకముందే, మరో పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఐసీసీ, కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.

Update: 2025-09-19 04:20 GMT

Pakistan : మ్యాచ్‌ను అడ్డుకుంటారా.. వీడియోలు రికార్డు చేస్తారా.. పాకిస్తాన్‌పై ఐసీసీ ఆగ్రహం

Pakistan : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు వరుస వివాదాలతో ఇబ్బందులు పడుతోంది. హ్యాండ్‌షేక్ వివాదం ఇంకా సద్దుమణగకముందే, మరో పెద్ద సమస్యలో చిక్కుకుంది. ఐసీసీ, కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. గతంలో మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పట్టుబట్టడం వల్ల యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ, ఇప్పుడు పీసీబీపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

అసలు వివాదం ఏమిటి?

యూఏఈతో జరిగిన గ్రూప్-ఎ చివరి లీగ్ మ్యాచ్‌లో, పాకిస్తాన్ జట్టు మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పట్టుబట్టింది. ఈ పంతం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం, యూఏఈతో మ్యాచ్‌కు ముందు పలు నియమాలను పాకిస్తాన్ ఉల్లంఘించిందని ఐసీసీ భావిస్తోంది. ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, సెప్టెంబర్ 17న జరిగిన ఈ సంఘటనలపై పీసీబీకి ఇ-మెయిల్ పంపారు. ఆ ఇ-మెయిల్‌లో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల ప్రాంతంలో వీడియోలు రికార్డు చేయడం ఒక తీవ్రమైన ఉల్లంఘన అని ఐసీసీ పేర్కొంది. ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

పీసీబీ బెదిరింపులు

పీసీబీ అధికారులు మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా, కోచ్ మైక్ హెస్సన్ మధ్య జరిగిన సంభాషణను పూర్తిగా రికార్డు చేయాలని పట్టుబట్టారు. ఈ ప్రాంతంలో వీడియో రికార్డింగ్ చేయకూడదని చెప్పినా, పీసీబీ వినలేదు. రికార్డు చేయడానికి అనుమతి ఇవ్వకపోతే, మ్యాచ్‌ను రద్దు చేస్తామని పీసీబీ బెదిరించింది. ఈ బెదిరింపుల కారణంగా, మ్యాచ్ సక్రమంగా జరిగేందుకు పీసీబీకి రికార్డింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు.

పీసీబీ దురుద్దేశం

పీసీబీ మీడియా మేనేజర్ PMOA ప్రాంతంలోకి ఫోన్ తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. దీనిని అడ్డుకున్నప్పుడు, వారు మళ్లీ మ్యాచ్ జరగకుండా అడ్డుకుంటామని బెదిరించారు. ఐసీసీ, పైక్రాఫ్ట్ ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినా, పీసీబీ ఈ సమావేశాన్ని ఒక అనవసరమైన డ్రామాగా మార్చడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. పీసీబీ ఈ ప్రవర్తనపై ఐసీసీ తీవ్రంగా పరిగణించి, చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News