Natasa Stankovic: పాండ్యా, నటాషా నిజంగానే విడిపోయారా.? ఈ పోస్ట్‌కు అర్థం అదేనా.?

Natasa Stankovic: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది.

Update: 2024-07-05 05:17 GMT

Natasa Stankovic: పాండ్యా, నటాషా నిజంగానే విడిపోయారా.? ఈ పోస్ట్‌కు అర్థం అదేనా.?

Natasa Stankovic: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. భార్య, బాలీవుడ్ నటి నటాషాతో పాండ్యా విడాకులు తీసుకున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై అటు పాండ్యా కానీ, ఇటు నటాషా కానీ ఒక్కసారి కూడా అధికారికంగా స్పందించి లేదు. దీంతో అసలు వీరి మధ్య ఏం జరుగుతోందని చర్చ సాగుతోంది.

అయితే విడాకుల వార్తల నేపథ్యంలోనే హార్ధిక్‌తో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేసిన నటాషా మళ్లీ తిరిగి వాటిని రీట్రైవ్ చేసింది. అయితే తాజాగా నటాషా ఇన్‌స్టా వేదికగా చేసిన మరో పోస్ట్‌ మరోసారి వీరిద్దరి మధ్య విడాకులకు సంబంధించిన వార్త మళ్లీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇన్‌స్టా వేదికగా నటాషా పోస్ట్‌ చేస్తూ.. 'జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. నిరుత్సాహపడతాం. అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దానిగురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది' అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేసింది.

దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీరిద్దరూ పక్కాగా విడాకులు తీసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నటాషా ఇన్‌స్టా వేదికగా పాండ్యాతో దిగిన ఫొటోలను డిలీట్ చేసినప్పటికీ నుంచే వీరి విడాకులకు సంబంధించి వార్తలు మొదలయ్యాయి. ఇక తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2024 భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ను నటాషా కనీసం విష్ చేయకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. 

Also Read: నటాషా స్టాంకోవిక్‌కు భరణంగా 70 శాతం హార్దిక్ పాండ్యా ఆస్తి.. ఈ వివాదంపై ఇప్పటివరకు ఏం తెలుసు?

Tags:    

Similar News