Harsh Goenka: సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా? నెట్టింట చర్చకు దాని తీసిన హర్ష్ గోయెంకా పోస్ట్
Harsh Goenka: సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా? నెట్టింట చర్చకు దాని తీసిన హర్ష్ గోయెంకా పోస్ట్
Harsh Goenka: ఆర్సీబీ వియోజత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కర్నాటక ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన పలు తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ..సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ రైల్వేస్టేషన్ లో తొక్కిసలాట, కుంభమేళాలో తొక్కిసలాట, బెంగళూరులో తొక్కిసలాట..ఈ ఘటనలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు.ఎవరూ రాజీనామా చేయలేదు..దీని నుంచి పాఠాలు నేర్చుకోలేదు.. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా వారి ప్రాణం విలువ కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారటడం లేదని హర్ష్ గోయెంకా తన పోస్టులో రాసుకువచ్చారు. హ్రుదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు.
అయితే ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట్లో చర్చకు దారి తీసింది. దీనిపై పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా దురద్రుష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి అంటూ కొందరు రాసుకొచ్చారు. సామాన్యుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. బెంగళూరు తొక్కిసలాటలో మొత్తం 11 మంది మరణించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకోవడంతో చిన్నస్వామి స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అంచనాకు మంచి జనం రావడంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. అదే సమయంలో వర్షం పడటంతో తొక్కిసలాట మొదలై పలువురు మరణించారు.