World Record : ఇంగ్లాండ్ రికార్డ్ విక్టరీ.. భారత్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో, చివరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ జట్టు 342 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో వైట్‌వాష్ అవమానం నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న సౌతాఫ్రికా జట్టు సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.

Update: 2025-09-08 05:50 GMT

World Record : ఇంగ్లాండ్ రికార్డ్ విక్టరీ.. భారత్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్

World Record : ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో, చివరి మ్యాచ్‌ను ఇంగ్లాండ్ జట్టు 342 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. దీంతో వైట్‌వాష్ అవమానం నుంచి తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న సౌతాఫ్రికా జట్టు సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 414 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీనికి జవాబుగా సౌతాఫ్రికా కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ తరఫున జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 414 పరుగులు చేసింది. ఓపెనర్లు జామీ స్మిత్, బెన్ డకెట్ కేవలం 16 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 దాటించారు. ఆ తర్వాత జో రూట్ (100), జాకోబ్ బెథెల్ (110) కలిసి 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రూట్‌కు ఇది 19వ వన్డే సెంచరీ కాగా, బెథెల్‌కు ఇది తొలి ఇంటర్నేషనల్ సెంచరీ. చివర్లో జోస్ బట్లర్ కేవలం 32 బంతుల్లో 62 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్‌ను 400 దాటించాడు.

415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ రెండో బంతికి ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్‌ను అవుట్ చేసి జోఫ్రా ఆర్చర్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. కేవలం 7 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఆర్చర్ 3 ఓవర్లలో కేవలం 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఆర్చర్ 9 ఓవర్లలో 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బ్రయాండన్ కార్సే, ఆదిల్ రషీద్ మిగిలిన 5 వికెట్లు పడగొట్టారు. గాయం కారణంగా కెప్టెన్ టెంబా బవుమా బ్యాటింగ్‌కు రాలేదు. చివరికి, సౌతాఫ్రికా జట్టు కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసింది.

ఈ 342 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్, వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా పేరున ఉండేది. టీమిండియా 2023లో శ్రీలంకను 317 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాకుండా, సౌతాఫ్రికాను 300కు పైగా పరుగుల తేడాతో ఓడించిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు (498), అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన రికార్డులు రెండూ ఇప్పుడు ఇంగ్లాండ్ పేరున ఉన్నాయి.

Tags:    

Similar News