BCCI: టీమిండియాకు డైమండ్ ఉంగరాలు.. రూ. 125కోట్ల బహుమతి

Update: 2025-02-08 04:30 GMT

BCCI: వెస్టిండీస్ వేదికగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియాపై అప్పట్లో బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. భారత జట్టుకు ఏకంగా రూ. 125కోట్ల నగదు బహుమతిని అందించింది. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ అక్కడితో ఆగిపోలేదు. జట్టులో ప్రతి ఒక్కరికి వజ్రపు ఉంగరాలను బహుమతిగా అందించింది. ఇటీవల బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో ఆటగాళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఉంగరాలను ప్రదానం చేసింది. వీటి గురించి వివరిస్తూ బీసీసీఐ గురువారం ఓ వీడియోను విడుదల చేసింది. నీలం, బంగారు వర్ణంతో ఉన్న ఉంగరం పై భాగంలో టీ20 ప్రపంచ ఛాంపియన్ ఇండియా అనే అక్షరాలతో పాటు అశోక చక్రం గుర్తు ఉంది. ఉంగరానికి అటు ఇటూ ఆటగాళ్ల పేర్లు, జెర్సీ నెంబర్లు, టీమిండియా ఎంత తేడాతో ఏ ప్రత్యర్థులపై విజయాలు సాధించిందో కూడా వాటిపై లిఖించారు. టీ 20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచిన భారత్ టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


Tags:    

Similar News