PKBS vs GT: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు.. తుది జట్లు ఇవే!
PBKS vs GT playing XI: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
PBKS vs GT IPL 2026: Punjab Kings Win Toss, Opt to Bowl; Playing XI Revealed
PBKS vs GT playing XI: ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మరికొద్ది సేపట్లో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. అందరి దృష్టి అయ్యర్, గిల్‌పైనే ఉంది. భారత టీ20 జట్టులో లేని ఈ ఇద్దరు.. ఐపీఎల్ 2026లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ 2026లో ఇదే మొదటి మ్యాచ్. ఈ నేపథ్యంలో టోర్నీలో ఆరంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. గతేడాది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్‌కు చేరుకున్న పంజాబ్.. ఈ సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరంగేట్ర సీజన్లోనే (2022)లోనే టైటిల్‌ను అందుకుని గుజరాత్.. తర్వాతి ఏడాది రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతోన్న గిల్ సేన ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగింది.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (కీపర్), కూపర్ కానెల్లీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్.
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఎమ్ షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, అశోక్ శర్మ, మహ్మద్ సిరాజ్.
ఇంపాక్ట్ సబ్‌సిట్యూట్స్:
పంజాబ్ కింగ్స్: ప్రియాంశ్ ఆర్య, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దుబె, విష్ణు వినోద్, సూర్యాంశ్ షెడ్జ్.
గుజరాత్ టైటాన్స్: ప్రసిద్ధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, జయంత్ యాదవ్, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్ర.