పోర్చుగల్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి బయట ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రమ్‌లో 200 మిల్లియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఇన్‌స్టాగ్రమ్ అధికారిక ఖాతాకు మాత్రం రొనాల్డో వెనుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ రొనాల్డో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రొనాల్డో ప్రత్యర్థి లియోనల్ మెస్సీ 141.8 మిల్లియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే 173.1 మిల్లియన్ల ఫాలోవర్లతో రొనాల్డో తర్వాతి స్థానంలో ఉన్నారు.
ప్రపంచంలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. క్రిస్టియానో రొనాల్డోను 200 మిల్లియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాలో పెయిడ్ పోస్టింగ్స్‌తో అత్యధిక ఆదాయం పొందుతున్న వ్యక్తికూడా రొనాల్డే.