IPL 2020 Costliest Player: ఐపీఎల్ 2020లో అత్యంత రెమ్యునరేషన్ తీసుకునే ఆటగాళ్లు వీళ్ళే...
IPL 2020 Costliest Player: ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం ఉప్పొంగుతుంది. తన అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనలు చూడడానికి తహాతహాలాడుతున్నారు
Costliest IPL Player From Each Franchise
IPL 2020 Costliest Player: ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముహుర్తం ఖరారు కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం ఉప్పొంగుతుంది. తన అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనలు చూడడానికి తహాతహాలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ జట్లు ఆటగాళ్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెక్కులను సిద్దం చేశారు. పెద్ద మొత్తంలో ఉన్న అడ్వాన్స్ రూపేనా నగదు చెల్లింపులు, తక్కువ మొత్తం ఉన్న ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో చెల్లింపు చేయాలని ఫ్రాంచైజ్లు నిర్ణయించాయి.
ఐపీఎల్ 2020లో ప్రాంచెసీల వారిగా ఎంత మొత్తం ఖర్చు పెట్టనున్నారు. భారీ మొత్తం తీసుకునే ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.. ఐపీఎల్ 2020 సీజన్ల కోసం 8 ఫ్రాంచైజీలు కలిసి 158 మంది ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాయి , దీని ప్రకారం రూ. 555 కోట్లను పారితోషికంగా అందించనున్నాయి. వీరిలో 128 మంది భారతీయ ఆటగాళ్లకు.. రూ. 358 కోట్లు కాగా, 63 మంది విదేశీ యాత్రలకు 195 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నారు. ఒక్కొక్క స్టార్ ప్లేయర్ కోసం ఫ్రాంచైజ్ కొట్ల రూపాయల వర్షం కురిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ప్రతి ఫ్రాంచైజీ యొక్క ఖరీదైన ఆటగాళ్లను చూద్దాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ - 17 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ : పాట్ కమ్మిన్స్ - 15.5 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోని - 15 కోట్లు
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ - 15 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : రిషబ్ పంత్ - 15 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ : స్టీవ్ స్మిత్ మరియు బెన్ స్టోక్స్ - 12.5 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ - 12.5 కోట్లు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ : కేఎల్ రాహుల్ - 11 కోట్లు