IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ లో కరోనా క‌ల‌క‌లం..

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ లో  కరోనా  క‌ల‌క‌లం..
x

super kings

Highlights

IPL 2020: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతున్నది. ఐపీఎల్ లో హ‌ట్ ఫెవ‌రేట్ గా బ‌రిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రారంభానికి ముందే జట్టులో కరోనా కలకలం రేపింది

IPL 2020: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2020 మరికొన్ని వారాల్లో ప్రారంభం కాబోతున్నది. కాగా, ఐపీఎల్ లో హ‌ట్ ఫెవ‌రేట్ గా బ‌రిలో దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రారంభానికి ముందే.. ఆది లోనే హంస పాదులా జట్టులో కరోనా కలకలం రేపింది. ఈ జట్టులోని ఓ ఆటగాడితో పాటు 12 మంది సహాయ సిబ్బందికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం నిర్వహించగా వీరికి కరోనా కొవిడ్‌-19 సోకిందని తెలిసింది. దీంతో ఆ జట్టులో కలవరపాటు మొదలైంది. ఈ వార్త ఒక్కసారిగా సంచలనం రేపింది. శుక్రవారం నుంచి ట్రైనింగ్ ప్రారంభించాలని అనుకుంటున్న టీమ్ కు ఈ వార్త శరాఘాతంలా తగిలింది. దీంతో తమ క్వారంటైన్ పిరియడ్ పొడిగించేందుకు టీమ్ సిద్ధమైంది. ఈ వార్తతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఐపీఎల్ మేనేజ్ మెంట్ ను, క్రికెట్ ప్రేమికులను ఆందోళనలో పడేశాయి. అయితే.. ఈ వార్తలతో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అలెర్ట్ అయింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానుంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు దుబాయ్‌కి చేరుకున్నాయి. నిబంధనల ప్రకారం అక్కడికి వెళ్లిన తర్వాత అన్ని జట్లు 6 రోజుల క్వారంటైన్ లో ఉండాలి. ఆ సమయంలో వారికి మూడు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన ఆటగాళ్లు మాత్రమే బయో బబులోకి వస్తారు. యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్‌ చెన్నై జట్టు నిన్నటితో పూర్తి చేసుకుంది. అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారందరూ విడివిడిగా ఉంటున్నారు. ఆరోగ్య అధికారుల ఆదేశాల మేరకు సిఎస్కే అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తోంది అని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది. కానీ పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు వెల్లడించలేదు.

కాగా.. దుబాయికి రాకముందు భారత్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారులు ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో కెప్టెన్ ఎంఎస్ ధోని, సురేష్ రైనాతో సహా మరికొంతమంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories