Coronavirus Updates in AP: ఏపీలో నాలుగు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

S. Srikanth
Updated on: 28 Aug 2020 7:30 PM IST
Coronavirus Updates in AP: ఏపీలో నాలుగు లక్షలు దాటిన పాజిటివ్ కేసులు..
X

Coronavirus Updates in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,526 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 61,331 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,526 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,463 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 10, కడప 09, నెల్లూరు 08, పశ్చిమగోదావరి 08, ప్రకాశం 08, విశాఖపట్నం 06, తూర్పుగోదావరి 06, కర్నూలు 06, అనంతపురం 05, కృష్ణా 05, శ్రీకాకుళం 05, గుంటూరు 04, విజయనగరం జిల్లాలో 01 చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,03,615. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,714. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,03,711కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 96,191 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 35,41,321 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.





S. Srikanth

S. Srikanth

Next Story