Greg Chappell on MS Dhoni: టీమిండియాకు అత్యుత్తమ సారథి ధోనీనే: గ‌్రేగ్ చాపెల్‌

Greg Chappell on MS Dhoni: టీమిండియాకు అత్యుత్తమ సారథి ధోనీనే: గ‌్రేగ్ చాపెల్‌
x

Team india former coach greg chappell says ms dhoni best india captain

Highlights

Greg Chappell on MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై టీమిండియా మాజీ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ గ్రేగ్ చాపెల్ ప్రశంస‌లు కురిపించాడు. భారత జట్టులో అత్యుత్తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ నే న‌ని కీర్తించారు.

'నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్ ధోనీనే. నా అభిప్రాయం ప్రకారం గత 50 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో మైఖెల్ బ్రేర్లీ, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, క్లైవ్ లాయడ్ తమ సారథ్యంతో అత్యంత ప్రభావం చూపారు. వారి సరసన ధోనీ కూడా నిలుస్తాడు. తొలిసారి ధోనీ బ్యాటింగ్ చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఆ క్షణమే అతనో గొప్ప క్రికెటర్ అవుతాడనిపించింది. అతని ఆత్మవిశ్వాసం. తోటి ఆటగాళ్లను ప్రోత్సాహించేవాడు. ఏదైనా నేరుగా మాట్లాడుతాడు. అదే విధంగా స్పందిస్తాడు. అతని ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగా ఉంటాయి. చాలా ఓపెన్‌గా ఉండే ధోనీతో పనిచేయడం చాలా సులువు.

అతను ఏదైనా చేయాలనుకుంటే అది చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతాడు. ధోనీ చలాకితానాన్ని అతని అపారమైన నైపుణ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకొని స్పూర్తిదాయక సారథిగా నిలిచాడు. మ్యాచ్‌ను ముగించే విషయంలో నేనేప్పుడు ధోనీకి సవాల్ విసిరేవాడిని. మ్యాచ్ గెలవడానికి గల పరుగులు చేసినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కనిపించేంది. ఖచ్చితంగా నేను చూసిన ఆటగాళ్లలో అతనో అత్యుత్తమ ఫినిషర్'అని చాపెల్ కొనియాడాడు. ధోని రిటైర్మెంట్ పై ఈ విధంగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories