Women's World Cup 2025 : బెంగుళూరులో వరల్డ్ కప్ మ్యాచ్‌లు రద్దు? 11 మంది మృతే కారణమా ?

Women's World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం మొత్తం 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

Update: 2025-08-08 06:36 GMT

Women's World Cup 2025 : బెంగుళూరులో వరల్డ్ కప్ మ్యాచ్‌లు రద్దు? 11 మంది మృతే కారణమా ?

Women's World Cup 2025: 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం మొత్తం 4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లలో భారత్-శ్రీలంక మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్, ఒక సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఉన్నాయి. అయితే, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కు ఇంకా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఈ మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన అనుమతి లభించలేదు. దీనితో, ఈ కీలకమైన మ్యాచ్‌లు వేరే వేదికలకు తరలిపోతాయేమోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో జరిగిన ఒక విషాద సంఘటనే దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ గెలిచినప్పుడు, దాని విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం చుట్టూ భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన స్టేడియం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. దీని తర్వాత, పెద్ద ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి వెనుకాడటంతో, మహారాజా టీ20 టోర్నమెంట్‌ను కూడా బెంగుళూరు నుంచి మైసూర్‌కు మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు, మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌ల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.

వేదికలు: ఈ టోర్నమెంట్‌కు భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్‌లో చిన్నస్వామి స్టేడియం (బెంగుళూరు), ఏసీఏ స్టేడియం (గువాహటి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడీసీఏ స్టేడియం (విశాఖపట్నం) వేదికలుగా ఉన్నాయి. శ్రీలంకలో ఆర్ ప్రేమదాస స్టేడియం (కొలంబో)లో మ్యాచ్‌లు జరుగుతాయి.

మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. అవి: భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్ జట్టు భారత్‌కు రావడం లేదు. అందుకే శ్రీలంకను సంయుక్త ఆతిథ్య దేశంగా ఎంపిక చేశారు. చిన్నస్వామి స్టేడియం నుంచి అనుమతి లభించకపోతే, ఐసీసీ , బీసీసీఐ కలిసి ప్రత్యామ్నాయ వేదికలను పరిశీలిస్తాయి. ఈ మ్యాచ్‌లను ఇతర స్టేడియాలకు తరలించే అవకాశం ఉంది.

Tags:    

Similar News