Asia Cup : ఆసియా కప్ ఫైనల్ గెలిపించినా.. 12 మంది ఆటగాళ్ల కెరీర్ ఖతం
Asia Cup: ఆసియా కప్ 17వ సీజన్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమవుతోంది.
Asia Cup : ఆసియా కప్ ఫైనల్ గెలిపించినా.. 12 మంది ఆటగాళ్ల కెరీర్ ఖతం
Asia Cup: ఆసియా కప్ 17వ సీజన్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమవుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్ల ఫైనల్స్‌లో హీరోలుగా నిలిచిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆసియా కప్ చరిత్రలో కేవలం ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే రెండుసార్లు ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. కేవలం ఒకే ఒక్క ఆటగాడు మాత్రమే వరుసగా రెండు సీజన్ల ఫైనల్స్‌లో ఈ అవార్డును పొందగలిగాడు. ఆసియా కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న మొత్తం 14 మంది ఆటగాళ్లలో 12 మంది కెరీర్ ముగిసిపోయింది. ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్ గెలిపించినప్పటికీ, ఇప్పుడు జట్టుకు దూరమయ్యారు.
ఆసియా కప్ (వన్‌డే ఫార్మాట్)
1984: మొదటిసారి జరిగిన ఈ టోర్నమెంట్‌ను ఇండియా గెలుచుకుంది. ఫైనల్‌లో సురీందర్ ఖన్నా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతను 56 పరుగులు చేయడమే కాకుండా, రెండు స్టంపింగ్స్ కూడా చేశాడు.
1986: ఈ టోర్నీని శ్రీలంక గెలిచింది. కానీ, పాకిస్థాన్‌కు చెందిన జావేద్ మియాందాద్ 67 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
1988: ఫైనల్‌లో 76 పరుగులు చేసి నవజ్యోత్ సింగ్ సిద్ధూ టీమ్ ఇండియాను గెలిపించాడు.
1990-91,1995: ఈ రెండు సీజన్లలో మహ్మద్ అజారుద్దీన్ అద్భుతంగా ఆడాడు. అతను వరుసగా 54, 90 పరుగులు చేసి టీమ్ ఇండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.
1997: ఈ సీజన్‌లో శ్రీలంక ఆసియా కప్‌ను గెలిచింది. మరవన్ అటపట్టు 84 పరుగులు చేసి హీరోగా నిలిచాడు.
2000: పాకిస్థాన్ ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో మొయిన్ ఖాన్ 56 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
2004: శ్రీలంకకు చెందిన మరవన్ అటపట్టు 65 పరుగులు చేసి మళ్ళీ తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.
2008: ఆసియా కప్ ఫైనల్‌ను శ్రీలంక గెలుచుకుంది. అజంతా మెండిస్ కేవలం 13 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
2012: పాకిస్థాన్ ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. షాహిద్ అఫ్రిది 32 పరుగులు చేసి, ఒక వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
2014: శ్రీలంక జట్టును లసిత్ మలింగ 5 వికెట్లు తీసి గెలిపించాడు.
2018: లిట్టన్ దాస్ 121 పరుగులు చేసినా, ఈ మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది.
2023: భారత్ మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఆసియా కప్ (టీ20 ఫార్మాట్)
2016: మొదటి టీ20 ఆసియా కప్‌ను భారత్ గెలిచింది. ఫైనల్‌లో శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
2022: శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది. భానుక రాజపక్స ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.