Asia Cup 2025 : ఆసియా కప్ లో ఆసక్తికర దృశ్యం.. ఒకే మైదానంలో భారత్, పాక్ టీంల ప్రాక్టీస్.. కానీ
Asia Cup 2025: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 9 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానుండగా, భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది.
Asia Cup 2025 : ఆసియా కప్ లో ఆసక్తికర దృశ్యం.. ఒకే మైదానంలో భారత్, పాక్ టీంల ప్రాక్టీస్.. కానీ
Asia Cup 2025: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ సందడి మొదలైంది. సెప్టెంబర్ 9 నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానుండగా, భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ పెద్ద మ్యాచ్‌కు ముందు, రెండు దేశాల ఆటగాళ్లు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేశారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇరు జట్లు ఒకే మైదానంలో ప్రాక్టీస్ చేసినప్పటికీ, ఆటగాళ్లు ఒకరితో ఒకరు కలుసుకుని మాట్లాడుకోలేదు.
భారత జట్టు ఇప్పటికే ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ జట్టు అక్కడకు చేరుకుంది. పాక్ ఆటగాళ్లు, భారత క్రికెటర్లు తమ నెట్స్‌లో చెమటోడుస్తూ ప్రాక్టీస్ చేయడం చూశారు. కానీ, వారిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేదు.. కనీసం పలకరించుకోలేదని వార్తలు వచ్చాయి. దీనికి కారణం వారు ఒకరినొకరు కలుసుకునే అవకాశం లేకపోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. పాక్ ఆటగాళ్లు అక్కడికి రాగానే తమ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
సెప్టెంబర్ 6 సాయంత్రం 7 గంటల తర్వాత పాకిస్తాన్ జట్టు దుబాయ్ ఐసీసీ అకాడమీకి చేరుకుంది. ఆసియా కప్‌కు ముందు జరుగుతున్న ట్రై-సిరీస్ ఫైనల్ కోసం వాళ్లు అక్కడ ప్రాక్టీస్ చేశారు. ట్రై-సిరీస్ ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు అఫ్ఘానిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓటమి పాలైన పాక్ జట్టు, ఈ ఫైనల్ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది.
ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుండగా, భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడనుంది. పాకిస్తాన్ జట్టు తమ రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఆడనుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్‌లో తలపడనున్నాయి. ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన టీ20 ఆసియా కప్‌లలో భారత్-పాక్ జట్లు 3 సార్లు తలపడగా, భారత్ 2 సార్లు గెలిచి పాకిస్తాన్‌పై ఆధిపత్యం చూపింది. పాకిస్తాన్ కేవలం ఒకసారి మాత్రమే గెలిచింది.