(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బెంగళూరుకు చెందిన రమేష్ శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు... కుటుంబసభ్యులతో కలిసి ముందుగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన చేత ఆలయంలోని గరుడాళ్వార్ మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణం చేయించారు, అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా నూతన సభ్యుడికి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు ధర్మారెడ్డి అందజేశారు.