Arunachalam Yatra: అరుణాచలం వెళ్లేవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు

Arunachalam Yatra: అరుణాచలం… శివుడి స్వరూపంగా భావించబడే పవిత్ర క్షేత్రం. ఇక్కడ గిరిప్రదక్షిణం చేయడం అంటే కేవలం ఒక యాత్ర కాదు, ఆత్మను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక ప్రయాణం.

Update: 2026-04-04 03:19 GMT

Arunachalam Yatra Rules

Arunachalam Yatra: అరుణాచలం… శివుడి స్వరూపంగా భావించబడే పవిత్ర క్షేత్రం. ఇక్కడ గిరిప్రదక్షిణం చేయడం అంటే కేవలం ఒక యాత్ర కాదు, ఆత్మను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే ఈ పవిత్ర మార్గంలో అడుగుపెట్టే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. నియమాలు పాటిస్తే యాత్ర ఫలితం రెట్టింపు అవుతుంది… లేకపోతే ఆధ్యాత్మికత తగ్గిపోతుంది.

గిరి ప్రదక్షిణ సమయంలో ఈ తప్పులు చేయకూడదు

గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అనుచిత ప్రవర్తనను పూర్తిగా పక్కన పెట్టాలి. అరుణాచలం వినోద ప్రదేశం కాదు. అసభ్యకరంగా మాట్లాడటం, ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం చేయకూడదు. ఇది భక్తి భావాన్ని తగ్గిస్తుంది. ఇక గిరిప్రదక్షిణ సమయంలో వీలైనంత వరకు ఫోన్‌ వాడకం తగ్గించాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో శివనామస్మరణకు సమయం కేటాయిస్తే యాత్ర సార్ధకమౌతుంది. అరుణాచలంలో చెప్పులు ధరించడం సాధ్యమౌనంత వరకు నివారించాలి. అయితే, ఆరోగ్యసమస్యలు ఉన్నవారు మాత్రం వినియోగించవచ్చు. ఇక ప్రదక్షిణ ఎల్లప్పుడూ సవ్యదిశలోనే చేయాలి. అపసవ్య దిశ సాధారణ భక్తులకు అనుకూలమైనది కాదు.

పాటించవలసిన నియమాలు

గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా సరే బ్రహ్మలింగం వద్ద ప్రారంభించి అక్కడే ముగించాలి. కోరికలతో కాకుండా నిష్కామ భక్తితో ప్రదక్షిణ చేయడం అత్యుత్తమం. నడక గర్భిణి స్త్రీ మాదిరిగా నెమ్మదిగా శాంతంగా, స్వామివారి నామం జపిస్తూ అడుగులు వేయాలి. తెల్లవారు జామున 2.30 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య లేదా సాయంత్రం నుంచి రాత్రి వరకు గిరి ప్రదక్షిణ చేయడం ఉత్తమం. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రదక్షిణ చేయాలి. అంతేకాదు, విభూతి, కుంకుమ ధరించడం ద్వారా మనసు మరింత భక్తిమయంగా మారుతుంది. గిరి ప్రదక్షిణ సమయంలో మార్గమధ్యలో ఉన్న ఆలయాలను, ఎనిమిది దిక్కుల్లో ఉన్న శక్తికేంద్రాలను దర్శించాలి. అంతేకాదు, మార్గంలో కనిపించే శునకాలకు ఆహారం పెట్టడం కూడా ఒక పవిత్రమైన ఆచారమే. భైరవ స్వరూపంగా భావించి వాటికి ఆహారం అందివ్వాలి. ఈ నియమాలను పాటిస్తూ ఎవరైతే గిరి వలయం ప్రదక్షిణ చేస్తారో వారికి మహాశివుని కృప తప్పకుండా లభిస్తుంది.

Tags:    

Similar News