Good Friday: గుడ్ ఫ్రైడే నాడు గెజిటెడ్ సెలవు ఎలా వచ్చిందంటే..?
Good Friday: గుడ్ ఫ్రైడే భారతదేశంలో ఒక అధికారిక గెజిటెడ్ సెలవుదినం.
Good Friday
Gazetted Holiday: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ ప్రతి మత సారాంశాన్ని, గొప్పతనాన్ని గౌరవించడం మన సంప్రదాయం. ఆ క్రమంలోనే, యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే 'గుడ్ ఫ్రైడే' కేవలం ఒక మతపరమైన దినంగానే కాకుండా, భారతదేశవ్యాప్తంగా ఒక అధికారిక గెజిటెడ్ సెలవుదినంగా ప్రభుత్వ గుర్తింపు పొందింది.
గెజిటెడ్ సెలవుదినం అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా తన గెజిట్లో కొన్ని ముఖ్యమైన రోజులను తప్పనిసరి సెలవులుగా ప్రకటిస్తుంది. గుడ్ ఫ్రైడే అటువంటి జాబితాలో ఒకటి. దీని అర్థం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఈ రోజున మూసివేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం, భారతదేశంలోని ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులు ఈ రోజున పనిచేయవు. పాఠశాలలు, కళాశాలలతో పాటు ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ రోజును సెలవుదినంగా పాటిస్తాయి.
ఈ రోజున దేశంలోని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది: ఉదయం నుంచే భక్తులు చర్చిలకు వెళ్లి, క్రీస్తు అనుభవించిన శ్రమలను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చాలామంది ఈ రోజున టీవీలు, వినోదాలకు దూరంగా ఉండి ఉపవాసం పాటిస్తారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో నడుస్తూ, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు పంపిణీ చేయడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కనిపిస్తాయి.




