Karthika Purnima Pooja 2025: కార్తీక పౌర్ణమి శుభముహూర్తం, పూజా సామగ్రి & సులభ పూజావిధానం ఇంట్లోనే!

Karthika Purnima 2025 నవంబర్ 5న జరుపుకుంటారు. ఇంట్లో సులభంగా చేయగల పూజావిధానం, పూజా సామగ్రి జాబితా, శుభముహూర్తం, పూజా మంత్రాలు, దీపారాధన ప్రాముఖ్యత, ఉపవాస నియమాలు ఇక్కడ తెలుసుకోండి.

Update: 2025-11-04 12:42 GMT

తేదీ: నవంబర్ 5, 2025 (బుధవారం)

పర్వదినం: త్రిపురారి పౌర్ణమి / దేవ దీపావళి / కార్తీక దీపోత్సవం

Karthika Purnima 2025 హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, తులసీదేవి మరియు కార్తికేయుడిని పూజిస్తారు. పాప విమోచనం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించే రోజు ఇది.

కార్తీక పౌర్ణమి పూజావిధానం (Step-by-Step Pooja Vidhanam)

1️.వేకువజామునే స్నానం – పవిత్ర జలస్నానం చేయాలి.

2.ఇంటి శుభ్రత – దేవుడి మందిరాన్ని శుభ్రపరచి ముగ్గు వేయాలి.

3️.దీపారాధన – తులసి కోట ముందు లేదా దేవాలయంలో 365 వత్తులతో దీపాలు వెలిగించండి. రెండు ప్రదేశాల్లోనూ వెలిగిస్తే మరింత శుభం.

కార్తీక పౌర్ణమి పూజా సామగ్రి (Pooja Samagri List)

  1. నూనె, వత్తులు, ప్రమిదలు
  2. తులసి ఆకులు, పూలు, పంచామృతం
  3. శివలింగం లేదా విష్ణువు ఫోటో
  4. పసుపు, కుంకుమ, అగరుబత్తి, కర్పూరం
  5. నైవేద్యం (పండ్లు, ప్రసాదం)

పూజా మంత్రాలు & క్రమం

సంకల్పం:

“మమ కార్తీక పౌర్ణమ్యాం శ్రీ శివ విష్ణు లక్ష్మీ తులసీ ప్రీత్యర్థం దీపదాన పూజా కర్మాహం కరిష్యే”

తర్వాత వినాయక పూజ చేయాలి → గౌరీదేవి, తులసీదేవి, విష్ణువు పూజించాలి → గౌరీ అష్టోత్తరం, చంద్ర అష్టోత్తరం చదవాలి → మంగళహారతి ఇవ్వాలి → ఆత్మప్రదక్షిణ చేయాలి.

దీపారాధన ప్రాముఖ్యత

  1. తులసి కోట వద్ద దీపం వెలిగించడం – పాప విమోచనం.
  2. శివాలయంలో నందాదీపం – కోటియజ్ఞ ఫలితం.
  3. ఇంటి బురుజు మీద దీపం వేలాడదీసి ఆకాశ దీపం చూపాలి.

పూజా మంత్రాలు (Pooja Mantras)

  1. శివ మంత్రం: ఓం నమః శివాయ
  2. విష్ణు మంత్రం: ఓం నమో నారాయణాయ
  3. లక్ష్మీ మంత్రం: ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః
  4. చంద్ర మంత్రం: ఓం చంద్ర దేవాయ నమః

దానం: పేదలకు దీపాలు, దుస్తులు, తులసి మొక్క, ఆహారం దానం చేయడం పుణ్యప్రదం.

ఉపవాసం నియమం

కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం పాటించాలి. పూజ అనంతరం నైవేద్య ప్రసాదం మాత్రమే తీసుకోవాలి.

తర్వాత రోజు కార్తీక బహుళ పాడ్యమి నాడు ఉపవాసం విరమించాలి.

Tags:    

Similar News