Chanakya Niti: ఈ 5 అలవాట్లు జీవితంలో సంతోషాన్ని దూరం చేస్తాయి.. చాణక్య ఏం చెప్పారంటే.
Chanakya Niti: జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రకాల అలవాట్లు, మన జీవన విధానమే సంతోషాన్ని నిర్ణయిస్తాయి. జీవితంలో సంతోషాన్ని దూరం చేసే అలాంటి 5 అలవాట్ల గురించి చాణక్యుడు ఎప్పుడో వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Chanakya Niti: ఈ 5 అలవాట్లు జీవితంలో సంతోషాన్ని దూరం చేస్తాయి.. చాణక్య ఏం చెప్పారంటే.
Chanakya Niti: జీవితంలో సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రకాల అలవాట్లు, మన జీవన విధానమే సంతోషాన్ని నిర్ణయిస్తాయి. జీవితంలో సంతోషాన్ని దూరం చేసే అలాంటి 5 అలవాట్ల గురించి చాణక్యుడు ఎప్పుడో వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడూ తప్పులే వెతికే మనస్తత్వం
ప్రతి విషయానికీ ఫిర్యాదు చేసే స్వభావం ఉన్నవాళ్లు జీవితాన్ని సులభంగా ఆస్వాదించలేరు. తమ పరిస్థితులు బాగోలేదని, అదృష్టం కలిసి రావడంలేదని లేదా ఇతరుల వల్లే సమస్యలు వస్తున్నాయని ఎప్పడూ అనుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు మనసులో నెగెటివ్ భావాలను పెంచుతాయి. అంతేకాదు, మంచి జరుగుతున్న సందర్భాల్లో కూడా అలాంటి వ్యక్తులు లోపాలే చూస్తారు. ఈ అలవాటు మనసులో నిరాశను పెంచుతుంది. ఫలితంగా జీవితం మీద ఆసక్తి తగ్గిపోతుంది. అందుకే ప్రతి విషయాన్ని నెగెటివ్ కోణంలో చూడకుండా, మంచి కోణాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలని చాణక్యుడు సూచించాడు.
అత్యాశతో జీవించే వారు
సంపద, విజయాలు మనిషికి అవసరం. అయితే వాటి కోసం అంతులేని ఆశ పెంచుకోవడం మాత్రం ప్రమాదకరం. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనే భావన కలిగిన వ్యక్తికి ఎప్పటికీ తృప్తి ఉండదు. అతని దృష్టి ఎప్పుడూ ఇతరుల దగ్గర ఉన్నదానిపైనే ఉంటుంది. తాను సాధించిన విజయాల్ని ఆస్వాదించడానికి కూడా సమయం ఇవ్వడు. దాంతో అతని మనసు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం సంతోషంగా జీవించాలంటే మన దగ్గర ఉన్నదానిపై కృతజ్ఞత భావం ఉండాలి. సంతృప్తి ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది.
కోపాన్ని నియంత్రించలేని స్వభావం
కోపం అనేది మనిషి బుద్ధిని కప్పివేసే భావోద్వేగం. చిన్న విషయానికే ఆగ్రహం చూపే వ్యక్తి తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవారినీ బాధపెడతాడు. కోపంలో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో తప్పుగా మారుతాయి.
ఇలా తరచుగా కోపం చూపించే వ్యక్తి సంబంధాలను కోల్పోవచ్చు. కుటుంబం, స్నేహితులు, సహచరులతో దూరం పెరుగుతుంది. ఒకసారి విరిగిపోయిన బంధాలను మళ్లీ నిర్మించడం చాలా కష్టం. అందుకే ఆలోచించి స్పందించడం, భావోద్వేగాలను నియంత్రించడం చాలా అవసరం అని చాణక్యుడు చెప్పారు.
చెడు సహవాసం ప్రభావం
మన చుట్టూ ఉండే వ్యక్తులు మన ఆలోచనలపై పెద్ద ప్రభావం చూపుతారు. ప్రతికూలంగా ఆలోచించే వాళ్లు, పనిమీద ఆసక్తి లేని వారు లేదా తప్పు మార్గాల్లో నడిచే వాళ్లతో ఎక్కువగా ఉండటం మంచిది కాదు. అలాంటి పరిచయాలు మనలో కూడా అదే విధమైన ఆలోచనలను పెంచుతాయి. నెమ్మదిగా మన లక్ష్యాలు, విలువలు మారిపోతాయి. చాణక్యుడి అభిప్రాయం ప్రకారం మంచి సహవాసం మన జీవితాన్ని ఉన్నతంగా మార్చగలదు. అలాగే చెడు పరిచయాలు మన ఎదుగుదలను అడ్డుకుంటాయి.
సమయం విలువను గుర్తించని వ్యక్తి
సమయం అనేది తిరిగి రాని సంపద. దాన్ని వృథా చేసే వ్యక్తి జీవితంలో వచ్చే అవకాశాలను కూడా కోల్పోతాడు. చాలా మంది “తర్వాత చూసుకుందాం” అనే అలవాటుతో పనులను వాయిదా వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మంచి అవకాశాలు దూరమవుతాయి. తర్వాత ఆలోచించినప్పుడు పశ్చాత్తాపం మాత్రమే మిగులుతుంది. చాణక్య నీతి ప్రకారం సమయాన్ని గౌరవించే వ్యక్తి జీవితంలో ముందుకు సాగుతాడు. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకునే వారు విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ.