Daily Horoscope : గజకేసరి రాజయోగం.. శివుని అనుగ్రహం ఏ రాశులపై ఉందంటే..?
Daily Horoscope : మార్చి 9, 2026 (సోమవారం) నాటి ద్వాదశ రాశుల ఫలితాలు . ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా మీ రాశికి ఈరోజు ఎలా ఉండబోతోంది?
Daily Horoscope
Today Rasi Phalalu: ఈ రోజు గ్రహ స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీ రాశిని బట్టి నేడు మీకు అదృష్టం ఎలా ఉందో చూడండి.
1. మేషం :
ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
2. వృషభం :
ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది.
3. మిథునం :
నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన చిక్కుముడి వీడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.
4. కర్కాటకం :
వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
5. సింహం :
ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. భూమి, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
6. కన్య :
సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. తోబుట్టువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది.
7. తుల :
అదృష్టం వరిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
8. వృశ్చికం :
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
9. ధనుస్సు :
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వ్యక్తుల నుంచి కానుకలు అందుకునే అవకాశం ఉంది.
10. మకరం :
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి.
11. కుంభం :
నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు.
12. మీనం :
ఓర్పుతో వ్యవహరించాల్సిన సమయం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవ ప్రార్థన మానసిక ప్రశాంతతను ఇస్తుంది.