Vastu Tips: ఎంత సంపాదించినా రూపాయి నిల‌వ‌డం లేదా.? ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూసుకోండి

Vastu Tips: కొంత మంది ఎంత సంపాదించినా డ‌బ్బులు నిల‌వ‌డం లేద‌ని బాధ‌ప‌డుతుంటారు. వ‌చ్చిన డ‌బ్బు వ‌చ్చిన‌ట్లు పోతోంద‌ని అంటారు.

Update: 2026-03-14 13:59 GMT

Vastu Tips: ఎంత సంపాదించినా రూపాయి నిల‌వ‌డం లేదా.? ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూసుకోండి

Vastu Tips: కొంత మంది ఎంత సంపాదించినా డ‌బ్బులు నిల‌వ‌డం లేద‌ని బాధ‌ప‌డుతుంటారు. వ‌చ్చిన డ‌బ్బు వ‌చ్చిన‌ట్లు పోతోంద‌ని అంటారు. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం ఇంట్లో మ‌నం చేసే కొన్ని త‌ప్పుల వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

కుళాయిల నుంచి నీరు కార‌డం

ఇంట్లో కుళాయిల నుంచి నీరు చుక్కలుగా పడుతుంటే అది వాస్తు ప్రకారం మంచిది కాదు. నీరు చుక్క చుక్కగా వృథా కావడం అంటే ఇంట్లో డబ్బు కూడా అలాగే వృథా అవుతుందని చెబుతారు. అందుకే ఇంట్లో ఎక్కడైనా న‌ళ్లాలు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని సరిచేయాలి. చిన్న సమస్య అని వదిలేస్తే అది ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతారు.

ఇంటి నీటి పారుదల దిశ ముఖ్యం

ఇంట్లో ఉపయోగించిన నీరు బయటకు వెళ్లే దిశ కూడా వాస్తులో ముఖ్యంగా ప్ర‌స్తావించారు. వాస్తు ప్రకారం ఇంటి నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం ఉత్తరం లేదా తూర్పు వైపుగా ఉండటం మంచిదని భావిస్తారు. ఈ దిశల్లో నీరు బయటకు వెళితే ఇంట్లో డబ్బు నిలవడం, ఆదాయం పెరగడం జరుగుతుందని అంటారు. తప్పు దిశలో నీరు వెళ్లేలా ఉంటే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశముంది.

డబ్బు పెట్టే బీరువా స్థానం

ఇంట్లో డబ్బు, నగలు పెట్టే అల్మిరా లేదా బీరువా ఎక్కడ ఉంచుతున్నామో కూడా వాస్తు ప్రకారం ప్రభావం చూపుతుందని చెబుతారు. బీరువా తలుపు ఉత్తర దిశ వైపు తెరుచుకునేలా ఉంచితే అది శుభప్రదమని భావిస్తారు.

ఉత్తరం దిశను ధన దిశగా భావిస్తారు. ఈ దిశలో బీరువా తలుపు తెరుచుకుంటే ఇంట్లో డబ్బు నిలుస్తుందని, ఆర్థిక స్థితి బలపడుతుందని నమ్మకం.

తులసి మొక్క ఎండిపోవడం మంచిది కాదు

మన భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసి మొక్కను పూజిస్తారు. కానీ ఆ మొక్క ఎండిపోతే అది వాస్తు ప్రకారం మంచిది కాదు. తులసి మొక్క పచ్చగా, ఆరోగ్యంగా ఉండటం ఇంటి శుభానికి సంకేతం అంటారు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినట్లయితే వెంటనే కొత్త మొక్కను నాటడం మంచిది. లేకపోతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావచ్చని నమ్మకం.

ఇంట్లో పగిలిన అద్దాలు ఉండకూడదు

పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభంగా భావిస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీకి సూచికగా చెబుతారు. ఇంటి లోపల పగిలిన అద్దం ఉంటే అది కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రావచ్చని వాస్తు నిపుణులు చెబుతారు. అందుకే ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసివేయడం మంచిది.

Tags:    

Similar News