Vastu Tips: అద్దె ఇంట్లో వాస్తు ఎలా ఉన్నా పర్లేదా.? పండితులు ఏం చెబుతున్నారంటే

Vastu Tips: ఇల్లు వాస్తుకు అనుగుణంగా ఉండాల‌ని తెలిసిందే. అయితే కొంద‌రు అద్దె ఇంట్లో ఉండే వారు వాస్తుతో సంబంధం లేద‌ని భావిస్తుంటారు. కానీ అద్దె ఇంట్లో ఉన్నా కూడా వాస్తు బాగుండాల‌ని చెబుతుంటారు. అద్దె ఇంట్లో నివసించే వారు పాటించాల్సిన కొన్ని వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2026-03-13 12:17 GMT

Vastu Tips: అద్దె ఇంట్లో వాస్తు ఎలా ఉన్నా పర్లేదా.? పండితులు ఏం చెబుతున్నారంటే 

Vastu Tips: ఇల్లు వాస్తుకు అనుగుణంగా ఉండాల‌ని తెలిసిందే. అయితే కొంద‌రు అద్దె ఇంట్లో ఉండే వారు వాస్తుతో సంబంధం లేద‌ని భావిస్తుంటారు. కానీ అద్దె ఇంట్లో ఉన్నా కూడా వాస్తు బాగుండాల‌ని చెబుతుంటారు. అద్దె ఇంట్లో నివసించే వారు పాటించాల్సిన కొన్ని వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రధాన ద్వారం వద్ద శుభచిహ్నాలు ఉంచడం మంచిది

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ద్వారా శక్తి ప్రవేశిస్తుందని భావిస్తారు. అందుకే అద్దె ఇంట్లోకి వెళ్లిన తర్వాత ముందు తలుపు వద్ద కొన్ని శుభచిహ్నాలు ఉంచడం మంచిదిగా భావిస్తారు. తలుపు రెండు వైపులా స్వస్తిక్ గుర్తులు గీయడం లేదా స్టిక్కర్ రూపంలో పెట్ట‌డం మంచిద‌ని చెబుతున్నారు. తలుపు మధ్య భాగంలో ఓం చిహ్నం ఉంచడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇవి ప్రతికూలతను తగ్గించి ఇంటికి సానుకూల శక్తి రావడానికి సహాయపడతాయని విశ్వాసం ఉంది.

ఉప్పుతో ఇంటి ప్రతికూలతను తగ్గించే విధానం

ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తగ్గించడానికి ఉప్పు ఉపయోగపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న గాజు గిన్నెలో దొడ్డు ఉప్పు తీసుకుని ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఉంచడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆందోళన, ఒత్తిడి తగ్గి వాతావరణం తేలికగా మారుతుందని నమ్మకం ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో ఎదురయ్యే ఆటంకాలు కూడా తగ్గుతాయని కొందరు విశ్వసిస్తారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆ ఉప్పును మార్చడం మంచిదని చెబుతున్నారు.

ఈశాన్య మూలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి

Vastu Tips: వాస్తులో ఈశాన్య దిశకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మూలను ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. కానీ చాలామంది అక్కడ పాత సామాన్లు లేదా పనికిరాని వస్తువులు పోగు చేస్తుంటారు. అలా చేయడం వ‌ల్ల‌ ఇంట్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం మంచిది. అక్కడ నీటితో నిండిన చిన్న కలశం లేదా పవిత్ర జలం ఉంచితే చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుందని కూడా విశ్వాసం ఉంది.

బెడ్‌రూమ్‌లో మంచం దిశపై జాగ్రత్త

నిద్రపోయే సమయంలో మన తల ఏ దిశలో ఉందో కూడా వాస్తు ప్రకారం ముఖ్యమని భావిస్తారు. సాధారణంగా తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండేలా నిద్రపోవడం మంచిదని సూచిస్తారు. మంచం నైరుతి మూలకు దగ్గరగా ఉంటే ఇంట్లో స్థిరత్వం పెరుగుతుందని కొందరు చెబుతున్నారు. ఒకవేళ ఆ దిశలో లోపం ఉంటే బరువైన అల్మారా లేదా ఫర్నిచర్ ఉంచడం ద్వారా సమతుల్యత తీసుకురావచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న మార్పులతో ఇంటి వాతావరణంలో మార్పు

అద్దె ఇల్లు కావడం వల్ల పెద్దగా మార్పులు చేయలేమని చాలామంది భావిస్తారు. కానీ చిన్నచిన్న వాస్తు సూచనలు పాటించడం ద్వారా కూడా ఇంట్లో మంచి వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇంటి పరిశుభ్రతను కాపాడడం, లైట్‌, గాలి సరిగా వచ్చేలా చూడడం, పనికిరాని వస్తువులను తొలగించడం వంటి చేస్తే మంచి ఫ‌లితాలు పొందొచ్చ‌ని పండితులు చెబుతున్నారు.

గ‌మ‌నిక‌: ఈ వివ‌రాలు కేవ‌లం వాస్తు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Tags:    

Similar News