Karthika Pournami: శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలతో సందడి

నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, దీపారాధన చేస్తున్నారు.

Update: 2025-11-05 05:40 GMT

Karthika Pournami: శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలతో సందడి

నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, దీపారాధన చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కాళేశ్వరం త్రివేణి సంగమం, భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తూ భక్తి భావంతో పూజలు చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిలలో కృష్ణానదిలో స్నానం చేసిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి, అలంపూర్ ప్రాంతాల్లో భక్తులు కృష్ణ, తుంగభద్ర నదుల వద్ద పుణ్యస్నానాలు చేసి, శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు.

నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి, కార్తీక దీపాలతో వెలుగులు నిండింది.

Tags:    

Similar News