Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఇళ్లు, దేవాలయాలు ఉదయం–సాయంత్రం దీపాలతో వెలుగులు విరజిమ్ముతుంటాయి.

Update: 2025-10-28 04:00 GMT

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో ఇళ్లు, దేవాలయాలు ఉదయం–సాయంత్రం దీపాలతో వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఇందులో ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి, దీపారాధనకు అత్యంత శుభదినంగా పరిగణించబడుతుంది. ఈ రోజు దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడంటే?

పంచాంగం ప్రకారం కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4వ తేదీ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై, 5వ తేదీ సాయంత్రం 6.48 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి ఉదయం సూర్యోదయ సమయంలో ఉండటం వల్ల, నవంబర్ 5వ తేదీనే కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

సముద్రం లేదా నదీ స్నానం ఎప్పుడు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజున పుణ్యస్నానం చేయాలనుకునే వారు ఉదయం 4.52 గంటల నుంచి 5.44 గంటల వరకు స్నానం చేయడం శ్రేయస్కరం. పూజా సమయం ఉదయం 7.58 నుంచి 9.00 వరకు ఉంటుంది. దీపారాధన చేయడానికి ఉత్తమ సమయం సాయంత్రం 5.15 నుంచి 7.05 గంటల వరకు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

దీపారాధన ఫలితం

పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారం. ఇలా ఒక్కరోజు దీపారాధన చేయడం వల్ల ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. చాలా మంది ఈ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగిస్తారు.

దీపాలు ఎలా వెలిగించాలి?

దీపారాధన సమయంలో అగ్గిపుల్లలతో లేదా కొవ్వొత్తులతో దీపాలు వెలిగించకూడదు. అగరబత్తి సహాయంతో వెలిగించడం శ్రేయస్కరం. ఆ తర్వాత "దామోదరం ఆవాహయామి" లేదా "త్రయంబకం ఆవాహయామి" అని చెప్పుతూ పూజ చేయాలి.

ఉసిరికాయలతో దీపారాధన

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయల్లో ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించడం చాలా శుభప్రదమని భక్తులు నమ్ముతారు. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభించి, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.

కార్తీక పౌర్ణమి రోజు స్నానం, దీపారాధన, ఉపవాసం చేయడం ద్వారా పాప విమోచనం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News