Vaastu Tips: లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తే పేదవారిగా మిగులుతారు... ఇంట్లో ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Vaastu Tips: సంపదకి అధినేత లక్ష్మీదేవి. ఈ తల్లి ఆగ్రహానికి గురైతే జీవితంలో పేదవారిగా మిగులుతాము.

Update: 2023-09-11 01:30 GMT

Vaastu Tips: లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తే పేదవారిగా మిగులుతారు... ఇంట్లో ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Vaastu Tips: సంపదకి అధినేత లక్ష్మీదేవి. ఈ తల్లి ఆగ్రహానికి గురైతే జీవితంలో పేదవారిగా మిగులుతాము. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని తప్పులు చేయవద్దు. దీనివల్ల లక్ష్మీకి కోపం వస్తుంది. తర్వాత ఫలితం తారుమారు అవుతుంది. జీవితంలో కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. వీరికి డబ్బుకి లోటు ఉండదు. కానీ మరికొంతమంది జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటారు కానీ వారి దగ్గర పైసా మిగలదు. దీనికి కారణం వాస్తు ప్రకారం చేసే తప్పులే. దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. అందుకే ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

ఇంట్లో మురికిని ఉండవద్దు

హిందూ విశ్వాసం ప్రకారం ఎక్కడైతే శుభ్రత, స్వచ్ఛత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే ఇంట్లో మురికిని ఉంచకూడదు. క్రమం తప్పకుండా ఇల్లు శుభ్రం చేయాలి. ఇంట్లో సాలెపురుగులు, ధూళి ఉన్న ఇళ్ల నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.

గొడవలు పడవద్దు

తరచుగా గొడవలు జరుగుతున్న ఇంట్లో లక్ష్మీ నిలవదు. వివాదాలకి దూరంగా ఉండాలి. ఇంట్లో పూజగది శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు దీపం వెలిగించాలి.

దానం చేయడం

దానం చేయడం వల్ల సంపద మరింత పెరుగుతుంది. అన్ని రకాల శాస్త్రాలు ఇదే విషయాన్ని చెబుతాయి. ఇలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది. శక్తి మేరకు దానం చేసే వారు లక్ష్మీ దేవి ఆశీర్వాదాలు పొందుతారు. డబ్బు ఉన్నప్పటికీ సహాయం చేయడానికి వెనుకాడేవారిపై లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది.

ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వేయవద్దు

డబ్బులని తప్పుగా మడిచి పర్సులో లేదా జేబులో పెట్టుకోవద్దు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పారేయవద్దు. దీనివల్ల లక్ష్మీ దేవి ఆగ్రహించి ఇంటిని వదిలి వెళ్లిపోతుంది. భవిష్యత్తులో వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాస్తు నియమాలు

హిందూ విశ్వాసం ప్రకారం లక్ష్మీ దేవి ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలి. ఈ నియమాన్ని విస్మరించి, దక్షిణ దిశలో ఉంచినట్లయితే లక్ష్మి కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీ దేవి విగ్రహాలు, ఫోటోలు ఉండకూడదు.

Tags:    

Similar News