22 ఏళ్ల యువకుడికి పెళ్లి పిల్లకు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేశారు

Update: 2025-04-20 11:53 GMT

పెళ్లి పిల్లకు బదులు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసి 22 ఏళ్ల యువకుడిని మోసం చేశారు

Young man got married with bride's Mother: కొన్ని ఘటనలు నమ్మడానికి వీల్లేకుండా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎంత విచిత్రంగా ఉంటాయంటే... మనం చూస్తుంది, వింటుంది నిజమేనా లేక ఏదైనా సినిమా స్టోరీనా అన్నంత నమ్మశక్యం కాకుండా ఉంటాయి. ఇంకొన్నిసార్లు కొన్ని సినిమాల్లో కామెడీ సీన్స్ చూసినప్పుడు కేవలం సినిమాల్లోనే ఇలా జరుగుతుంది కానీ నిజ జీవితంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని అనిపిస్తుంది. సినిమాల్లో అది కామెడిగానే అనిపిస్తుంది కానీ నిజ జీవితంలో నిజంగానే అలా జరిగితే అది పెద్ద ట్రాజెడీనే అవుతుంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కూడా అలాంటిదే. 22 ఏళ్ల యువకుడికి తను కలలుగన్న పిల్లను కాకుండా 45 ఏళ్ల వయసున్న ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే... మీరట్ లోని బ్రహ్మపురికి చెందిన మొహమ్మద్ అజీమ్ కు షమ్లి జిల్లాకు చెందిన మంతాషాకు పెళ్లి నిశ్చయం చేశారు. అజీమ్ సోదరుడు నజీమ్, ఆయన భార్య ఈ పెళ్లి సంబంధం కుదిర్చారు. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే మార్చి 31న పెళ్లి జరిగింది. కానీ వధువు స్థానంలో ఉన్నది మంతాషా కాదు... ఆమె తల్లి తాహిరా. విచిత్రం ఏంటంటే... తను పెళ్లి చేసుకుంటోంది మంతాషాను కాదు తాహిరాను అనే విషయం వరుడు అజీమ్‌కు తెలియదు.

ముస్లిం సంప్రదాయం ప్రకారమే నిఖా పూర్తయింది. నిఖా తంతులో భాగంగా వారికి పెళ్లి చేస్తోన్న మత పెద్ద మౌళ్వి వధువు పేరును తాహిరా అని పలికారు. వాస్తవానికి వధువు పేరు మంతాషా. కానీ మౌళ్వి ఆమెను తాహిరా అని పిలవడంతో అజీమ్ కు అనుమానం వచ్చింది. వెంటనే వధువు ముఖంపై వేళ్లాడుతున్న హిజాబ్ ను ఎత్తి ఆమె ముఖం చూసి షాక్ అయ్యారు. అజీమ్ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనయ్యింది. వధువు స్థానంలో మంతాషా లేదు. ఆమె తల్లి, వితంతువు అయిన తాహిరా ఉన్నారు.

రిప్రజెంటేషనల్ ఇమేజ్

తనును మోసం చేసి వధువుకు బదులు ఆమె తల్లితో పెళ్లి జరిపించారు అని అర్థం చేసుకున్న వరుడు అజీమ్ అరిచి గొడవ చేశారు. కానీ అజీమ్ సోరదుడురు, వదినలే ఆయనపై బెదిరింపులకు దిగారు. ఈ పెళ్లిని తిరస్కరిస్తే నీపై రేప్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారు. కానీ తనకు జరిగిన అన్యాయంపై ఏప్రిల్ 17న వరుడు అజీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ మరో రెండు రోజుల్లోనే అజీమ్ తనంతట తనే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు అని బ్రహ్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సౌమ్య ఆస్తానా తెలిపారు. రెండు పార్టీలు ఒక సెటిల్మెంట్ కు వచ్చాయని తెలిసిందని, అందుకే అజీమ్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారని సౌమ్య ఆస్తానా చెప్పారు.

విచిత్రం ఏంటంటే, ఇటీవల కాలంలో ఇలాంటి చిత్ర విచిత్రమైన ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. కాబోయే అల్లుడితో వెళ్లిపోయిన అత్త, కూతురు మామతో వెళ్లిపోయిన తల్లి, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ... ఈ నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. 

Most read interesting news stories: జనం ఎక్కువగా చదివిన వార్తా కథనాలు

Tags:    

Similar News