Viral Video: ఏనుగును చూసి సింహాలు పారిపోయాయి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Viral Video: అడవిలో రారాజు సింహమే అని అందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ “రాజు” కూడా భయపడిపోతాడు! ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.
Viral Video: ఏనుగును చూసి సింహాలు పారిపోయాయి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Viral Video: అడవిలో రారాజు సింహమే అని అందరికీ తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ “రాజు” కూడా భయపడిపోతాడు! ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. వీడియోలో ఏనుగును చూసి సింహాలు భయంతో పారిపోవడం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
@AMAZlNGNATURE అనే ఎక్స్ (X) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేయబడింది. అందులో — కొన్ని సింహాలు తమ పిల్లలతో కలిసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తున్నాయి. అప్పుడు ఓ భారీ ఏనుగు నెమ్మదిగా ఆ చెట్టు వైపు నడుచుకుంటూ వస్తుంది. చెట్టు దగ్గరకు చేరిన వెంటనే ఏనుగు గట్టిగా గర్జించడంతో సింహాలు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టాయి.
ఈ వీడియో నెట్టింట్లో షేర్ అవగానే కాసేపట్లోనే వైరల్ అయింది. ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా వీక్షించగా, 36 వేల లైక్స్ వచ్చాయి. “ఇప్పుడు అడవి రాజుకి కూడా భద్రత అవసరమయ్యింది” అని ఒకరు కామెంట్ చేయగా, “అడవికి నిజమైన రాజు ఏనుగే” అని మరొకరు పేర్కొన్నారు. మరో యూజర్ “సింహాలు తమ శక్తి ఎంత ఉందో మర్చిపోయాయి” అని సరదాగా స్పందించారు.