MySouthDiva 2026 Calendar: గ్లామర్ అండ్ గ్రేస్: ఘనంగా 'మైసౌత్‌దివా' 2026 క్యాలెండర్ ఆవిష్కరణ.. 12 నెలలు, 12 మంది ముద్దుగుమ్మలు!

Update: 2026-01-31 09:39 GMT

MySouthDiva 2026 Calendar: టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మైసౌత్‌దివా' (MySouthDiva) తన 9వ ఎడిషన్ 2026 క్యాలెండర్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. మీడియా9 మరియు భారతి సిమెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖుల సమక్షంలో జరిగింది.

నారీ శక్తికి నిదర్శనం.. క్యాలెండర్ హైలైట్స్

స్టైల్, మోడ్రన్ ఫ్యాషన్ మరియు నారీ శక్తిని ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. 12 నెలలకు గానూ 12 మంది ప్రముఖ నటీమణులను ఒక్కో థీమ్‌తో ఇందులో ప్రదర్శించారు.

ప్రముఖ నటీమణులు: శ్రియా శరణ్, అనన్య నాగళ్ల, రియా సచ్ దేవా, ఉల్క గుప్తా, పాలక్ అగర్వాల్, మనస్వి మంగై, చాంద్సీ కటారియా, సాక్షి మ్హాడోల్కర్, సిమ్రత్ కౌర్, గెహ్నా సిప్పీ, రియా సుమన్, ఐశ్వర్య సాల్వి ఈ క్యాలెండర్‌లో మెరిశారు.

ముఖ్య అతిథులు: ఈ కార్యక్రమంలో నటీమణులు గెహ్నా సిప్పీ, ఉల్క గుప్తా తదితరులతో పాటు నిర్మాతలు రమేష్ పుప్పాల, శ్యాంసుందర్ నేతి, భారతి సిమెంట్స్ డీఎం రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.

ప్రతిభకు పట్టాభిషేకం: మనోజ్ కుమార్

మీడియా9 డైరెక్టర్ మరియు ప్రముఖ ఫోటోగ్రాఫర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. "అందం కంటే ఆత్మవిశ్వాసానికి, మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ ఈ క్యాలెండర్‌ను రూపొందించాం. యువతులను ప్రేరేపించడమే మా లక్ష్యం" అని తెలిపారు. సెలబ్రిటీ మేనేజ్‌మెంట్‌లో అగ్రగామిగా ఉన్న మీడియా9, ఇప్పటికే 'ఫలక్‌నుమా దాస్' వంటి విజయవంతమైన చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం.

Tags:    

Similar News