Viral Video : స్టేజ్ మీద వధూవరుల ముద్దులాట..ఏం ఆగలేకపోతున్నారా అంటూ పంతులు గారి మాస్ ఎంట్రీ

స్టేజ్ మీద వధూవరుల ముద్దులాట..ఏం ఆగలేకపోతున్నారా అంటూ పంతులు గారి మాస్ ఎంట్రీ

Update: 2026-01-31 02:47 GMT

Viral Video : భారతీయ వివాహాలు అంటేనే ఆచారాలు, సాంప్రదాయాలకు నిలయం. అయితే మారుతున్న కాలంతో పాటు వెస్ట్రన్ కల్చర్ ప్రభావం మన పెళ్లిళ్లపై గట్టిగానే పడుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. పెళ్లి మండపంపై వధూవరులు కాస్త రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లి ముద్దు పెట్టుకోబోతుండగా.. ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన పంతులు గారు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‎లో షేర్ అయిన ఈ వీడియో భారతీయ వివాహాల్లో మారుతున్న ధోరణులను కళ్లకు కడుతోంది. వీడియో ప్రారంభంలో.. ఎర్రటి లెహంగా ధరించిన పెళ్లి కూతురు కెమెరా మెన్ల హడావిడి మధ్య చాలా స్టైలిష్‌గా స్టేజ్ వైపు నడుచుకుంటూ వస్తుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న పెళ్లి కొడుకు, ఆమె రాగానే ఒక గులాబీ పూల బొకే ఇచ్చి స్వాగతం పలుకుతాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఫోటోషూట్ కోసం ఆ జంట ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చాలా దగ్గరకు వచ్చారు.

ఆ జంట వెస్ట్రన్ సినిమాల్లో లాగా ఒకరినొకరు ముద్దు పెట్టుకోబోతున్నారని గ్రహించిన అక్కడి పంతులు గారు.. వెంటనే అప్రమత్తమయ్యారు. వారు ఇంకా దగ్గరకు రాకముందే చకచకా స్టేజ్ మీదకు చేరుకుని, ఆ జంట మధ్యలోకి వచ్చి వారిని విడదీశారు. ఇది పెళ్లి మండపమని, ఇక్కడ ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పకనే చెప్పారు. పంతులు గారి ఈ మెరుపు ఎంట్రీతో వధూవరులు ఒక్కసారిగా షాక్ అయ్యి విడిపోయారు. కేవలం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు లక్షలాది మందిని ఆకర్షిస్తోంది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది "వీరికి ఇప్పుడు కొత్త తరం (Gen Z) పంతులు గారు కావాలి" అని జోకులు వేస్తుంటే, మరికొందరు మాత్రం పంతులు గారిని సమర్థిస్తున్నారు. "పెళ్లి అనేది ఒక పవిత్రమైన కార్యం. వెస్ట్రన్ కల్చర్ పేరుతో మన సంస్కృతిని పాడు చేయకూడదు. పంతులు గారు చేసిన పని నూటికి నూరు శాతం సరైనది" అని కామెంట్స్ చేస్తున్నారు. వెడ్డింగ్ ఆర్గనైజర్లు పెళ్లిని ఒక సినిమా షూటింగ్‌లా మార్చేస్తున్నారని, అనవసరమైన యాక్టింగ్ చేయిస్తున్నారని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


ఈ రోజుల్లో డ్రీమ్ వెడ్డింగ్ పేరుతో బడ్జెట్ కంటే ఎక్కువగా హడావిడి చేయడం, ఆచారాల కంటే షో-ఆఫ్ కే ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోయింది. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు లేదా పురోహితులు జోక్యం చేసుకుని పద్ధతులు గుర్తు చేయడం అవసరమని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. పంతులు గారి సమయస్ఫూర్తిని కొనియాడుతూ వేల సంఖ్యలో లైకులు, షేర్లు వస్తున్నాయి.

Tags:    

Similar News