Viral News: భార్యకు బట్టతల వచ్చిందని విడాకులు.. 16 ఏళ్ల బంధానికి పాతరేసిన భర్త!
Viral News: చైనాలో అమానవీయ ఘటన.. అనారోగ్యంతో జుట్టు రాలిపోయి బట్టతల వచ్చిందని 16 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడు ఓ భర్త. విటిలిగో వ్యాధితో బాధపడుతున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి, విడాకులతో వీధిన పడేసిన వైనం.
Viral News: వివాహ బంధం అంటే కష్టసుఖాల్లో తోడుండాలి. కానీ, చైనాలో ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు అనారోగ్యం వస్తే అండగా ఉండాల్సింది పోయి, ఆమె అందం తగ్గిందని ఏకంగా విడాకులిచ్చాడు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న అనుబంధాన్ని మొండిగా తెంచేసుకున్న ఈ ఘటన హెనాన్ ప్రావిన్స్‌లో వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ (36) అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితంలో రెండేళ్ల క్రితం 'విటిలిగో' (Vitiligo) అనే చర్మ వ్యాధి రూపంలో కష్టం మొదలైంది. ఈ వ్యాధి ప్రభావంతో ఆమె జుట్టు తెల్లబడటమే కాకుండా, విపరీతంగా ఊడిపోయి బట్టతల వచ్చింది.
అండగా ఉండాల్సింది పోయి..
అసహ్యించుకున్నాడు! భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఓదార్చాల్సిన భర్త, ఆమెను చూసి అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. కనీసం వైద్యం చేయించడానికి కూడా ఇష్టపడలేదు. తన పరువు పోతుందని భావించి ఫంక్షన్లకు కూడా ఆమెను తీసుకెళ్లడం మానేశాడు. చికిత్స ఖర్చు భరించలేక ఆమెను మానసికంగా వేధిస్తూ నరకం చూపించాడు.
కన్నీటి గాథ.. ఒంటరిగా మిగిలిన బాధితురాలు:
భర్త వేధింపులు, ఒత్తిడి వల్ల లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. చివరకు అతను విడాకులు కోరగా, మరో దారి లేక ఆమె అంగీకరించింది. కోర్టు సైతం బిడ్డ బాధ్యతను భర్తకే అప్పగించడంతో లీ పూర్తిగా ఒంటరైపోయింది. "అతని లాంటి కఠిన హృదయుడిని ఎక్కడా చూడలేదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన తీరు నెటిజన్ల కళ్లు చెమరుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భర్త తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.